ప్రభాస్ హీరోగా రచయిత కొరటాల శివని డైరెక్టర్ పరిచయం చేస్తూ ‘మిర్చి’ సినిమా నిర్మించింది యు.వి. క్రియేషన్స్ సంస్థ. ఆ తర్వాత ‘రన్ రాజా రన్’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’, ‘భాగమతి’లాంటి విజయవంతమైన సినిమాలు నిర్మించింది. ప్రభాస్ తో ‘బాహుబలి’తర్వాత ‘సాహో’ సినిమాని రూ. 250 కోట్ల వ్యయంతో నిర్మించింది. ‘సాహో’ హిందీలో హిట్ అయినా మిగిలిన భాషల్లో అంతంత మాత్రం అనిపించుకుంది. అయినా వెనుకాడక ‘జిల్’ లాంటి ప్లాప్ సినిమా అందించిన రాధాకృష్ణ డైరెక్షన్ లో ‘రాధే శ్యామ్’ సినిమా నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పట్లో పెద్ద సినిమాల నిర్మాణం జోలికి పోకూడదని యు.వి. క్రియేషన్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ మేర్లపాక గాంధీ అసిస్టెంట్ డైరెక్టర్ కార్తీక్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సంతోష్ శోభన్ హీరోగా ఓ చిన్న సినిమా నిర్మిస్తోంది. ఇప్పుడు అదే హీరో సంతోష్ శోభన్ తోనే మరో సినిమా తీయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.
అనిల్ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంతోష్ శోభన్ సరసన సోనియా ఆకుల హీరోయిన్ గా నటించబోతోంది. సోనియా రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘దిశా ఎన్ కౌంటర్’ లో దిశా పాత్ర పోషించింది . ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.











