చీట్లపేక క్లబ్ లోనూ, కేసినోల్లోనూ ఆడితే విలాసం.. బైట ఆడితే జూదం. అదే ఆన్ లైన్ లో ఆడితే ? ఎప్పుడూ వివాదమే. ఆన్ లైన్ లో రమ్మీ తరహా గేమ్స్ అడండి.. బోలెడంత డబ్బు గెలుచుకోండి అంటూ.. ప్రకటనలు జొప్పించి.. యువతను పెడదోవ పట్టిస్తున్నాయి కొన్ని ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ సైట్లు. దీనివల్ల చాలా మంది యువకులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు.
ఈ తరహా ఈ చట్ట విరుద్ధమైన ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు కొందరు సెలబ్రిటీస్ అనుకూల ప్రకటనలు కూడా ఇస్తున్నారు. అలాంటి వారి మీద చట్ట పరంగా చర్యలు తీసుకొనే కార్యక్రమాన్ని చేపట్టింది మద్రాస్ హైకోర్టు. వీరిలో ప్రముఖ క్రికెటర్స్, సినీ నటీనటులు కూడా ఉన్నారు. వారందరికీ మద్రాస్ హైకోర్టు నోటీసులు జారిచేసింది. వీరంతా ఈ నెల 19లోగా సమాధానం ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఆ లిస్ట్ లో విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, తమన్నా, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, సుదీప్ లు ఉన్నారు.











