బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ అని అభిమానులు ఎంతో గర్వంగా పిలుచుకొనే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్. కొంతకాలంగా అతడు సినిమాల పరంగా నిరాశపరుస్తూనే ఉన్నా.. ప్రపంచ వ్యాప్తంగా అతడిగాడికున్న క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు సరికదా.. తదుపరి చిత్రం గురించి ఎంతో ఆత్రుతగా ఎదరుచూస్తున్నారు అభిమానులు. ఇటీవల తన 55వ పుట్టినరోజును జరుపుకున్నారు షారుఖ్ ఖాన్. ఈ సందర్భంగా ఆయనకి కోట్లాది అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే.. ఎంతో మంది సినీ సెలబ్రిటీస్ , వ్యాపార రంగ ప్రముఖులు కూడా విషెస్ తెలిపారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని షారుఖ్ ఖాన్ ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన టవర్ కలిగి ఉన్న దేశం దుబాయ్. ఆ టవర్ పేరు బూర్జ్ ఖలీఫా. దాని ఎత్తు రికార్డు స్థాయిలో 2, 772 అడుగులు. దాని నిర్వాహకులు షారుఖ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రత్యేకమైన లేజర్ షో ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా షారుఖ్ `ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన, ఎత్తైన స్క్రీన్‌పై నన్ను నేను చూసుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింద`ని ఆనందం వ్యక్తం చేశాడు. తన పిల్లలు చాలా ఎంజాయ్ చేశారని పేర్కొన్నాడు.










