బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రసవత్తరంగా సాగుతోంది. 61వరోజు ఎపిసోడ్ లో రింగ్ లో రంగు టాస్క్ లో భాగంగా కెప్టెన్ అయిన అమ్మరాజశేఖర్ అవినాష్ ను స్టోర్ మేనేజర్ గా చేసుకొని తన విశ్వరూపం చూపిస్తున్నాడు. ఇలా కెప్టెన్ అయ్యీ అవగానే.. హౌస్ మేట్స్ అందరినీ ఒక ఆట ఆడుకున్నాడు. ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఏమేమి వింతలు , విడ్డూరాలు జరిగాయో చూసేద్దాం..
అమ్మ కెప్టెన్సీ వ్యూహం
రింగు లో రంగు టాస్క్ లో భాగంగా.. అమ్మరాజశేఖర్ హారిక మీద పడి.. ఆమె టీ షర్ట్ ను ఎరుపురంగు చేసేశాడు. అరియానా మీద కూడా రంగు పడడంతో .. రంగులేమీ పడకుండా తప్పించుకున్న అమ్మ.. చక్కగా కెప్టెన్ అయ్యాడు. ఒకొక్కరి మీద అధికారం చెలాయించాలనీ, తన తడాఖా చూపించాలని ఫిక్సయ్యాడు. ఇంగ్లీష్ లో మాట్లాడితే.. జైల్లో వేసేస్తాననగానే.. బిగ్ బాస్ జైలు తాళాలు పంపించడం .. అవినాష్ ను రేషన్ మేనేజర్ గా నియమించడం జరుగుతుంది.
అమ్మ గారి అధికారం.. ఆజ్ఞలు
అమ్మరాజశేఖర్ తన కెప్టెన్సీలో హౌస్ మేట్స్ ను ముప్పుతిప్పలు పెట్టాలని ఫిక్సయ్యాడో లేదో తెలియదు కానీ.. అతడి దూకుడు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. కొత్త కొత్త నిబంధనలు పెట్టాడు. అరియానాను బుజ్జగించి ఏ పనీ చేయకుండా తన అసిస్టెంట్ గా నియమించుకున్నాడు. గొడవలు వద్దంటూనే ఎవరినో ఒకరిని గిల్లడం చేస్తూ అమ్మ శాడిస్టిక్ మెంటాలిటీతో బిహేవ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అనవసరంగా అభిజిత్ ను టార్గెట్ చేసి తన శాడిజం తీర్చుకున్నట్టు అనిపిస్తుంది. అతడు బిగ్ బాస్ వద్ద బుక్ అవడం పాపం అనిపిస్తుంది. ఇంతకీ అమ్మ.. అభిజిత్ ను ఎలా బుక్ చేశాడు?
అభిజిత్ ఇంగ్లీష్ ముక్కలు.. అమ్మ రాజశేఖర్ అగ్గిమీద గుగ్గిలం
అభిజిత్ హౌస్ లో జరుగుతున్న పరిస్థితుల మీద మాట్లాడుతూ ఎంతో ఫ్రస్టేట్ అవుతాడు. ఆ క్రమంలో పొరపాటున అతడి నోటినుంచి రెండు ఇంగ్లీష్ మాటలు దొర్లుతాయి. దాంతో అభికి బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వస్తుంది. అది వినిపించడంతో కెప్టెన్ రాజశేఖర్ వెంటనే లేచి చప్పట్లు కొడుతూ .. అభిజిత్ మీద రంకలేస్తాడు. తను చెప్పేవరుకూ నిలబడమని పనిష్మెంట్ ఇస్తాడు.
సోహైల్, మెహబూబ్ మధ్య పచ్చగడ్డి లేకుండానే భగ్గుమంది
మాస్టర్ రూల్స్ వల్ల సోహైల్, మెహబూబ్ ల మధ్య మాటమాట పెరుగుతుంది. అయితే దాన్ని లైట్ తీసుకున్న సొహైల్ .. మెహబూబ్ చేతికి చాక్లెట్ అందిస్తాడు. కానీ మెహబూబ్ మాత్రం తనకి నీ ఫ్రెండ్ షిప్ వద్దనేస్తాడు. దాంతో సొహైల్ లో కోపం నషాళానికంటుంది. చేతికందిన వస్తువుల్ని విసిరేస్తూ .. రభస చేస్తాడు. దాంతో అఖిల్ సోహైల్ ను బుజ్జగించి.. ఇద్దరి మధ్యా సంధి కుదిర్చే ప్రయత్నం చేస్తాడు.
బిగ్ బాస్ గుడ్డు థీరీకి గుడ్లు తేలేసిన హౌస్ మేట్స్
మైకుల బ్యాటరీ కోసం బజర్ మోగితే.. స్టోర్ రూమ్ లోకి చివరగా వచ్చిన వారి గుడ్డు మొదటి అడుగుపెట్టిన వారి అకౌంట్లోకి వెళుతుందని చెప్పడంతో.. ఇంటి సభ్యులు ఆ థీరికి గుడ్లు తేలేస్తారు. తర్వాత మైకు బ్యాటరీల కోసం బజర్ మోగుతుంది. ఎక్కడ గుడ్డు పోతుందోనని ఇంటి సభ్యులు పరిగెత్తుకుంటూ వెళ్తారు. మొదట అవినాష్ వెళ్ళగా.. చివర్లో అమ్మ తాపీ గా నడుచుకుంటూ వెళ్ళడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.
అమ్మకి ఎలిమినేషన్ తప్పదా?
ఈ రోజు శనివారం కాబట్టి. నాగార్జున వస్తారు. రేపు ఆదివారం ఎలిమినేషన్ ఉంటుంది. మొత్తం పదిమందిలోనూ.. అమ్మరాజశేఖర్ , హారిక, అవినాష్, మోనాల్ , అభిజిత్, నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో ఎవరు ఈ వారం సేవ్ అవుతారో .. ఎవరు ఇంట్లో సేఫ్ గా ఉంటారో చూడాలి. అయితే… ఈ వారం అమ్మరాజశేఖర్ కే ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఎన్ని వింతలు చోటు చేసుకుంటాయో చూడాలి.











