అక్కినేని కుటుంబం నుండి చిత్రపరిశ్రమకు పరిచయమైన మూడో తరం హీరో అఖిల్. అతను నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. అందుకు సంబంధించిన ఓ పోస్టు ను సామాజికమాద్యమం లో పోస్టు చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ప్రస్తుతం మనాలీ లో చిత్ర నిర్మాణం సాగుతోందని డైరెక్టర్ సురేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మంచి మాస్ యాక్షన్ చిత్రమని ఈ ఫోటోను చూస్తే అర్థమవుతుంది..
ఏజెంట్ చిత్రం పై బోలెడ్ ఆశలు పెట్టుకున్నారు అక్కినేని కుటుంబం. అఖిల్ కేరియర్ లో ఇది మంచి చిత్రం గా మిగలనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హిటో కోసం హీరో అఖిల్ తీవ్రం శ్రమిస్తున్నారని తెలుస్తోంది. భయపెట్టే యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు.
ఈ చిత్రం ఆగష్టు 12న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మమ్ముట్టీ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది.ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకరి నిర్మాత కాగా, హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు.