అందాల ఆరబోతలో రకుల్ స్టయిలే వేరు. అరకొర డ్రెస్సులు వేసుకుని సినిమాలకు వచ్చేస్తుంటుంది. తను ఏం చేయాలనుకుంటుందో అది చేసేస్తుంది. ఎవరికీ భయపడే తత్వం కాదు. తాజాగా ఈ బికినీ పోజు తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ బికినీలో ఆమె ఏంచేసిందో తెలుసా? శనివారం సాయంత్రం సముద్రంలోకి దూకేసిందట. స్కూబా డైవింగ్ ఆమె సరదా. ఇలా దూకి దాదాపు 40 అడుగుల లోపలికి డైవ్ చేసుకుంటూ వెళ్లిందామె. ఒక్కర్తే కాదనుకోండి.
Also Read:-మల్దీవ్స్ లో బికినీ తో సందడి చేస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్
తమ్ముడు అమన్, అమ్మానాన్న రాజేందర్, కుల్విందర్ లతో కలిసి ఆమె గత గురువారం మాల్దీవులకు వెళ్లారు. ఆమెకిది విహారయాత్ర అట. నిన్న శనివవారం ఈ స్కూబ్ డైవింగ్ చేసిందామె. తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ తో కలిసి సముద్ర జలాల్లో ఎంజాయ్ చేసి, వాటిని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బొమ్మలాగా ఉండే రకుల్ బికినీలో పోజిస్తే ఆ ఫొటో వైరల్ కాకుండా ఎలా ఉంటుంది. అక్కడితో ఆగలేదు స్కూబా డైవింగ్ వీడియో కూడా పోస్టు చేసేసింది.
Also Read:-రకుల్ ఆ కేసు నుంచి సేఫ్ అయినట్లేనా











