సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి చిత్రం రాజకుమారుడు. ఈ చిత్రానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. తొలి సినిమాతోనే మహేష్ ఘన విజయం సాధించి యూత్ ని ఆకట్టుకున్నారు. అభిమానులు ఎలా చూడాలనుకుంటారో.. మహేష్ ని అలా చూపించారు. అందుకనే ప్రేక్షకాభిమానులను రాజకుమారుడు మెప్పించాడు. అయితే.. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గెస్ట్ రోల్ చేసారు. రాజకుమారుడు సినిమాలో తండ్రీకొడుకులు కృష్ణ – మహేష్ లను ఓకే ఫ్రేములో చూడడం అభిమానులకు భలే నచ్చేసింది.

అయితే.. నాడు మహేష్ తొలి సినిమా కోసం చేసినట్టే.. నేడు హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ సినిమా విషయంలో కూడా చేస్తున్నారు దర్శకేంద్రుడు. రోషన్ తో దర్శకేంద్రుడు పెళ్లిసందడి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి ముందుగా దర్శకేంద్రుడే దర్శకుడు. అయితే.. ఆతర్వాత దర్శకత్వ బాధ్యతలను తన శిష్యురాలు గౌరీ రోనక్ కి అప్పగించారు. ఆయన కేవలం దర్శకత్వం పర్యవేక్షణ మాత్రమే చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ గెస్ట్ రోల్ చేయనున్నారని తెలిసింది. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాని రీసెంట్ గా ప్రారంభించారు.
నాటి పెళ్లి సందడి చిత్రానికి సంగీతం అందించిన కీరవాణి నేటి పెళ్లి సందడికి కూడా సంగీతం అందిస్తుండడం విశేషం. ఈ రోజు షూటింగ్ ప్రారంభమైన పెళ్లిసందడి వచ్చే సంవత్సరంలో సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. మరి.. తండ్రి శ్రీకాంత్ మూవీ టైటిల్ తో రానున్న తనయుడు రోషన్ తొలి సినిమాతోనే మెప్పిస్తాడేమో చూడాలి.
Also Read: మహేష్ బాబు తల్లి గా జ్యోతిక ?











