May 21, 2026 9:53 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

నవరసాలను శాసించిన కంచుకంఠం( జగ్గయ్య జన్మదిన ప్రత్యేకం) 

తెలుగు తెరపై నవరసాలను నడిపించిన నటులు ఎందరో ఉన్నారు .. కానీ నవరసాలను శాసించిన నటులు కొందరే ఉన్నారు. అలాంటి అతికొద్ది మంది నటుల్లో 'కొంగర జగ్గయ్య' ఒకరుగా కనిపిస్తారు. ఈ రోజు ఆయన జన్మదినం.

December 31, 2020 at 9:38 AM
in Cinema, Tollywood
Kongara Jaggayya

Kongara Jaggayya

Share on FacebookShare on TwitterShare on WhatsApp

 కొంగర జగ్గయ్య.. నవరసాలను ఆయన తన స్వరంతో శాసించారు .. తన కళ్లతో ఆదేశించారు. అప్పట్లో ఎన్టీఆర్ .. ఎస్వీఆర్ ఇద్దరికీ కూడా వాళ్ల స్వరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తమ రూపానికి తగిన స్వరంతో వాళ్లు తమకి లభించిన పాత్రలను అద్భుతంగా పండించారు .. అశేష ప్రేక్షకులను మెప్పించారు. అలా ఖంగుమంటూ మ్రోగే తన కంచుకంఠాన్ని ఒక వజ్రాయుధంగా ఉపయోగిస్తూ, తెలుగు ప్రేక్షకుల హృదయాలలో జగ్గయ్య తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. జగ్గయ్య .. తెనాలి సమీపంలోని ‘మోరంపూడి’ గ్రామంలో జన్మించారు. అప్పట్లోనే ఆయన తండ్రి నాటకాలు వేస్తూ ఉండేవారు. అదే బాటలో జగ్గయ్య నడిచారనే అనుకోవాలి. స్కూల్ డేస్ లోనే జగ్గయ్య చాలా తెలివైన విద్యార్థిగా ఉండేవారు.

ఒక వైపున మంచి మార్కులు తెచ్చుకుంటూ .. మరో వైపున నాటకాలపై ఆసక్తిని కనబరిచేవారు. కాలేజ్ ఏజ్ వచ్చేసరికి నాటకాల పట్ల ఆయన ఆసక్తి మరింత పెరిగింది. అప్పట్లో ‘సావిత్రి’ని .. ‘జమున’ను నాటకాలకు పరిచయం చేసింది ఆయనే. కాలేజ్ రోజుల్లోనే ఆయనకి సాహిత్యం పట్ల మక్కువ పెరిగింది. ఎక్కువగా పుస్తకాలు చదవడం .. కవితలు రాయడం చేసేవారు. చిత్రలేఖనంలోను ఆయనకి మంచి ప్రవేశం ఉంది.

ఆ కాలంలో నాటకానుభవం ఉన్నవారంతా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించేవారు. అదే బాటలో జగ్గయ్య కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలు ఫలించి .. ‘ప్రియురాలు’ .. ‘ఆదర్శం’ అనే చిత్రాల్లో ఆయనకి హీరోగా అవకాశాలు వచ్చాయి. అయితే ఆ సినిమాలు అంతగా ఆడకపోవడంతో ఆయన నిరాశ చెందారు. ‘బంగారుపాప’ సినిమా తరువాత నుంచి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. అద్భుతమైన వాయిస్ ఆయనకి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది .. తెలుగు తెరపై ఆయన మాట మంత్రమై మోగేలా చేసింది.

ఒక వైపున ఎన్టీఆర్ .. ఏఎన్నార్ వంటి అగ్రకథానాయకుల సినిమాలలో కీలకమైన పాత్రలను పోషిస్తూనే, కథానాయకుడిగా తనకి వచ్చిన అవకాశాలను కూడా ఆయన సద్వినియోగం చేసుకున్నారు. అలా ఆయన ‘అన్నపూర్ణ’ .. ‘ఈడూ జోడూ’ .. ‘ఉయ్యాల జంపాల’ సినిమాలలో హీరోగా విజయాలను అందుకున్నారు. పౌరాణికాలకు .. జానపదాలకు తన బాడీ లాంగ్వేజ్ సెట్ కాదని గ్రహించిన ఆయన, ఆ వైపు ఎక్కువగా వెళ్లలేదు. సాంఘిక చిత్రాలలోనే తన సత్తాను చాటుతూ వెళ్లారు. ఫలానా పాత్ర జగ్గయ్య చేస్తేనే బాగుంటుందని భావించి, దర్శక నిర్మాతలు తన కోసం వెయిట్ చేసేలా చేశారు.

‘డాక్టర్ చక్రవర్తి’లో భార్యను అనుమానించే భర్తగా .. ‘గుడిగంటలు’లో స్నేహితుడి కోసం ప్రియురాలికి దూరమైయ్యే మిత్రుడిగా  .. ‘ఆత్మబలం’ సినిమాలో అహంభావం కలిగిన కుమార్ గా ఆయన నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను కూడా ఆయన గొప్పగా పండించారు. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో రూథర్ ఫార్డ్ గా ఆయన ప్రదర్శించిన నటన అసమానం .. అద్భుతం అనిపించుకుంది. ఆ పాత్రకి కూడా ఆయన వాయిస్ ప్రధానమైన బలంగా నిలిచింది. ఇప్పటికీ ఆ సినిమా చూస్తే జగ్గయ్య తప్ప వేరెవరూ ఆ పాత్రను ఆ స్థాయిలో పండించలేరనే విషయం స్పష్టమవుతుంది.

ఒక వైపున క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూనే, మరో వైపున సాహిత్య సేవ చేసేవారు. ప్రజలను చైతన్యవంతులను చేసే కవితలు రాస్తుండేవారు. అంతేకాదు ఇతరభాషా చిత్రాలు తెలుగులోకి అనువాదాలుగా అడుగుపెడుతున్నప్పుడు ప్రధానమైన పాత్రలకు డబ్బింగ్ చెప్పేవారు. ముఖ్యంగా ‘శివాజీ గణేశన్’కి ఆయన వాయిస్ అచ్చుగుద్దినట్టుగా సరిపోయేది. ‘భక్తతుకారం’ సినిమాలో ‘శివాజీ’ పాత్ర హైలైట్ గా నిలవడం వెనుక ప్రధానమైన పాత్ర వహించింది జగ్గయ్య వాయిస్సేనని చెప్పుకోవాలి.

ఇలా తన హుందాతనానికి తగిన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, నాలుగు దశాబ్దాలకి పైగా ఆయన తెలుగు తెరపై రాజ్యం చేశారు. మహామహులైన నటులతో కలిసి స్వర్ణయుగం చూశారు. వందలాది పాత్రలతో లక్షలాదిమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. మొదటి నుంచి దేశాభిమాని అయిన ఆయన, రాజకీయాల్లోను ప్రవేశించి తనవంతు సేవలను అందించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ‘గీతాంజలి’ని తెలుగులో ‘రవీంద్ర గీత’ పేరుతో జగ్గయ్య అందించారు.

ఇలా వివిధ రంగాలలో తను చేసిన కృషికిగాను ఆయన ‘పద్మభూషణ్’ పురస్కారం అందుకున్నారు.జగ్గయ్య స్వరంలో రాజసం .. ఠీవీ .. దర్పం .. హుందాతనం వినిపిస్తాయి. అక్షరాలా ఆయన రూపంలోను అవే కనిపిస్తాయి. నవరసాలను శాసించిన .. శ్వాసించిన ఆ ‘కళావాచస్పతి’ జయంతి నేడు. ఈ సందర్భంగా ‘ది లియో న్యూస్’ ఆయనను స్మరించుకుంటోంది.

– పెద్దింటి గోపీకృష్ణ

Tags: Jaggayya actorJaggayya actor biographyJaggayya actor photosjaggayya birthday sepcialJaggayya latest newsjaggayya moviesjaggayya speical storykongara jaggayyasenior actor Jaggayyatelugu film industrytelugu film newstollywood senior actor Jaggayya
Previous Post

బీహార్ లో పెద్దన్న నితీష్ పై  ‘చిన్నచూపు’ చీలిక

Next Post

పందులు, కుక్కలపై జగన్ సర్కారు కొత్త జీవో

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

అందుకేనా ప‌వ‌న్ కి విషెస్ చెప్పాడు మ‌హేశ్

ఎంతో ఘాటు ప్రేమతో కుర్రకారును కిర్రెక్కించే వెబ్ సిరీస్

Kaala Actress Sakshi Agarwal Latest Photo Gallery

సీనియర్ నటి కవిత ఇంట్లో తీవ్ర విషాదం.

శ్రీదేవి ఆద‌ర్శం అంటున్న ఆలియా

గుడివాడలో చంద్రబాబు ఎంట్రీ.. కొడాలి నాని టీమ్‌ ఏం చేసిందంటే..??

విచారణకు క్యూ కడుతున్న సినిమా భామలు

ముఖ్య కథనాలు

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist