బిగ్ బాస్ 4 ఫైనల్ ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రావడం.. కంటెస్టంట్లకు బిగ్ బాస్ వేదిక పై చిరు వరాలు ఇవ్వడం తెలిసిందే. దివికి వేదాళం రీమేక్ లో పోలీసాఫీసర్ గా ఛాన్స్ ఇచ్చారు. సోహైల్ తీసే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తానన్నారు. అంతే కాకుండా.. అతని సినిమాలో గెస్ట్ రోల్ ఇస్తే.. చేస్తానన్నారు. ఇక మెహబూబ్ కి కూడా చిరు తన సినిమాలో ఓ పాత్ర ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు చిరు బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కి ఛాన్స్ ఇచ్చారని ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.. చిరు ఆచార్య సినిమా తర్వాత లూసీఫర్ రీమేక్ లో నటించనున్నారు. మలయాళంలో విజయం సాధించిన ఈ మూవీ తెలుగు రీమేక్ కి మెహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అయితే.. ఇందులో చిరు తమ్ముడు క్యారెక్టర్ ఉందట. ఆ క్యారెక్టర్ సీఎం క్యారెక్టర్ అని.. ఆ పాత్రను అభిజిత్ కు ఆఫర్ చేసారని వార్తలు వస్తున్నాయి. ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజమో కాదో తెలియదు కానీ.. నిజమైతే మాత్రం అభిజిత్ లక్కీ ఛాన్స్ దక్కించుకున్నట్టే.
Also Read: బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ ఆ క్రేజీ మూవీలో నటిస్తున్నాడా?
https://www.youtube.com/watch?v=Xx0cOOfknkg











