బిగ్ బాస్ విన్నర్ అభిజిత్.. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది కానీ.. ఆశించిన స్ధాయిలో గుర్తింపు రాలేదు. సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న టైమ్ లో బిగ్ బాస్ లో అవకాశం రావడం.. విన్నర్ గా నిలవడంతో వరుసగా ఇంటర్ వ్యూలు ఇస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నాడు. అభిజిత్ కి ఇప్పటి వరకు రాని గుర్తింపు బిగ్ బాస్ 4 విన్నర్ అవ్వడంతో వచ్చింది. దీంతో ఫ్రెండ్స్ తో పార్టీలు.. మీడియాతో ఇంటర్ వ్యూలు.. పుల్ జోష్ తో దూసుకెళుతున్నాడు. త్వరలో సక్సస్ టూర్ ప్లాన్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. అభిజిత్, ఎఫ్ 3 మూవీలో కీలక పాత్ర పోషించనున్నాడు అని వార్తలు వస్తున్నాయి. విక్టరీ వెంకటేష్ – మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎఫ్ 3 మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ స్టార్ట్ అయ్యింది. ఇందులో ఎఫ్ 2లో నటించిన వాళ్లతో పాటు కొత్త వాళ్లకు కూడా అవకాశం ఇస్తున్నారని తెలిసింది. అయితే.. బిగ్ బాస్ 4 ఫైనల్ ఎపిసోడ్ కి వెళ్లిన అనిల్ రావిపూడి అభిజిత్ తో కీలక పాత్ర చేయిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
అలాగే.. భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో అభిజిత్ ఓ సినిమా చేయనున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇలా.. అభిజిత్ గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది కానీ.. అఫిషియల్ గా ఎలాంటి ఎనౌన్స్ మెంట్ రాలేదు. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై అభిజిత్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Must Read ;- విజయ్ దేవరకొండ ఇంట్లో బిగ్ బాస్ విన్నర్ పార్టీ..!