తిరుపతిలో ఏపీ పోలీస్ డ్యూటీ మీట్ 2021లో వర్చువల్ ద్వారా పాల్గొన్న సిఎం జగన్.. దేవుని విగ్రహాలు ధ్వంసం చేయడం గురించి వ్యాఖ్యానించారు. మా ప్రభుత్వ పనులను ప్రజలు మెచ్చుకుంటుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. రాజకీయల కోసం దేవుణ్ణి సైతం వదలడం లేదు. చివరికి విగ్రహాలు విధ్వంస చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి ఇలాంటి చర్యలు చేపడుతున్నారు.
రాత్రికి రాత్రి విగ్రహాలు విధ్వంసం చేసేది వాళ్లే.. తెల్లారగానే రచ్చ చేస్తున్నది వాళ్లే.. అంటూ ప్రతి పక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు జగన్. రాజకీయంగా లబ్ధి పొందడానికి దేవుని విగ్రహాలను విధ్వంసం చేస్తున్నారు. ప్రజలు కూడా ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. టార్గెట్ చేసి ఇలాంటి చర్యలకు పాల్పడుతన్నారని ప్రజలు అర్థం చేసుకోగలగాలి. దేవుడంటే భయం, భక్తి లేకుండా పోయింది.
ప్రభుత్వం మంచి పనలతో ప్రజల్లో పొందుతున్న ఆదరణను తగ్గించడానికి ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రపూరితమైన చర్యల్లో భాగమే ఈ విగ్రహ విధ్వంసఖాండ అని జగన్ ప్రతి పక్షాలను దుయ్యబట్టారు. ఈ ఘటనలు చూస్తుంటే.. కలియుగంకి అంతానికి వచ్చిందనిపిస్తుంది. ప్రభుత్వం ప్రజా సంక్షేమాలు ఏర్పాట్లు చేసిన సమయంలో అక్కడ ప్రతి పక్షం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుంది. ఇలాంటి విష ప్రచారాలు, దుష్ట కార్యలు చేసినంత మాత్రానా ఎలాంటి ప్రయోజనం ఉండదని జగన్ తెలియపరిచారు. మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. ఇది ప్రతి పక్షాలకు, అధికార పక్షానికి మధ్య జరుగుతున్న పొలిటికల్ గెరిల్లా వార్‌లా ఉందని చెప్పుకొచ్చారు జగన్.
Also Read: జగన్.. మద్యం పై మాట తప్పలే.. కాని తిప్పారు..