అప్ కమింగ్ కమెడియన్ సుహాస్ హీరోగా రెడీ అవుతున్న సినిమా ‘కలర్ ఫోటో’. ఈ సినిమాను సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. గతం లో సాయి రాజేష్ నుంచి కొబ్బరి మట్ట, హృదయ కాలేయం అనే సినిమాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కలర్ ఫోటో కూడా ఓ స్పూఫ్ సినిమా అవుతుంది అని సినీ జనాలు అనుకున్నారు. ఐతే ఈసారి సాయి రాజేష్ అండ్ టీం తమ ప్లాన్ మార్చేశారు. కలర్ ఫోటో పై ఎక్కడా కూడా కొబ్బరి మట్ట, హృదయ కాలేయం వంటి తమ స్పూఫ్ కామెడీలు పడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా సమాచారం.
ఇటీవలే రిలీజ్ చేసిన కలర్ ఫోటో టీజర్ కి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా రైట్స్ కోసం టాలీవుడ్ లో ఉన్న పలువురు అగ్ర నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు అని టాక్. ముందు వీరంతా ఈ సినిమాను చిన్న చూపు చూసిన వారే కావడం గమనార్హం. ఐతే ఈ సినిమా నిర్మాత సాయి రాజేష్ కి గీత ఆర్ట్స్ వరకు ఎప్పటి నుంచో మంచి రిలేషన్ ఉంది.
సాయి రాజేష్ గత సినిమాలు కొబ్బరి మట్ట, హృదయ కాలేయం కి గీత వారే ఫైనాన్స్ ఇప్పించారు. దీంతో బయట నుంచి కలర్ ఫోటో కోసం క్రేజీ ఆఫర్స్ వస్తున్నా సాయి రాజేష్ మాత్రం గీత లోనే ఈ సినిమాను పెట్టాలి అనే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడమో లేక గీత వారు మైంటైన్ చేస్తున్న ఆహా యాప్ లో ఈ సినిమాను డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేసే ప్లాన్ లో సాయి రాజేష్, దర్సకుడు సందీప్ ఉన్నట్లు తెల్సింది.











