టాలీవుడ్ అందాల చందమామ .. కాజల్ అగర్వాల్ పెళ్ళికి ముందు ఎంత స్పీడ్ గా సినిమాలు చేసేదో అందరికీ తెలిసిందే. సీనియర్ హీరో, చిన్న హీరో అనే బేధాలు లేకుండా.. బ్యాలెన్సింగ్ గా సినిమాలు చేస్తూ .. కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా పరుగు పెట్టించింది. రీసెంట్ గా అమ్మడి పెళ్ళి జరిగిపోయింది. దాంతో అభిమానులు ఆమె సినిమాలు ఎక్కడ మానేస్తుందోనని టెన్షన్ పడ్డారు.

అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ..ఇప్పుడు అమ్మడు సినిమాలు మీద సినిమాలు చేసేస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తో పాటు .. కమల్ హాసన్ కు జోడీగా భారతీయుడు 2 లోనూ, అలాగే.. హాయ్ సినామిక, ముంబై సాగ, మంచు విష్ణు మోసగాళ్ళు సినిమాల్లో సైతం నటిస్తోంది. ఈ నేపథ్యంలో అమ్మడు ఇప్పుడు మరో సినిమాను కూడా తన కిట్టీలో వేసుకుంది.
గుళేబకావళి ఫేమ్ కళ్యాణ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాజల్ . కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇక తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. మొత్తం మీద కాజల్ అగర్వాల్ పెళ్ళి తర్వాత తన కెరీర్ కు ఎలాంటి ఆటంకంగా కలగకుండా సినిమాలు మీద సినిమాలు చేసేయడం విశేషమనే చెప్పాలి.
Must Read ;- అందాల కాజల్ కోసమే ఆచార్య వెయింటింగ్











