మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంటే.. చరణ్ సరసన పూజా హేగ్డే నటిస్తుంది. ఇందులో చరణ్ గెస్ట్ రోల్ అనుకున్నారు కానీ.. ఆతర్వాత చరణ్ పాత్రను దాదాపు గంటసేపు ఉండేలా పాత్ర పరిధిని పెంచారు. చరణ్ సరసన నటించేందుకు ముందుగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ అనుకున్నారు.
అయితే.. ఈ అమ్మడు బాలీవుడ్ లో బిజీగా ఉండడం వలన ఆచార్యలో చరణ్ సరసన నటించేందుకు నో చెప్పిందని వార్తలు వచ్చాయి. ఆతర్వాత క్రేజీ హీరోయిన్ రష్మిక పేరు వినిపించింది. రష్మిక ఫిక్స్ అనుకున్నారు కానీ.. ఫైనల్ గా పూజా హేగ్డేను ఎంపిక చేశారు. ఈ సినిమా కోసం తీసుకుంటున్న పూజా రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ.. ఎంత తీసుకుంటుందంటే.. 20 నిమిషాల పాత్రకు కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అని వార్తలు వస్తున్నాయి.
ఆమె అడిగిన రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ఆచార్య మేకర్స వెంటనే ఓకే చెప్పారట. అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, ప్రభాస్ సరసన రాధేశ్యామ్ చిత్రాల్లో నటిస్తున్న పూజా హేగ్డే ఫస్ట్ టైమ్ చరణ్ సరసన నటిస్తుంది. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రేజీ మూవీని మే 7న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Must Read ;- ‘ఆచార్య’ టీజర్ కి చరణ్ వాయిస్ ఓవర్











