పోర్న్ స్టార్ సన్నీలియోన్ తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. కరోనా కారణంగా గత కొంతకాలంగా ఆమె షూటింగులకు దూరంగా ఉంది. ఇప్పుడు ఆమె చూపు వెబ్ సిరీస్ వైపు పడింది. తాజాగా విక్రమ్ భట్ రూపొందిస్తున్న యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ ‘అనామిక’ చేస్తోంది. ఈమధ్య కాలంలో సన్నిలియోన్ కాస్త వెనకబడిందనే చెప్పాలి. ఒకప్పుడు గూగుల్ లో అత్యధికంగా శోధించిన భారతీయురాలిగా సన్నీలియోన్ వరసగా ఎనిమిదేళ్లు అగ్రస్థానంలో నిలిచింది.
సినిమా నటిగా పరిశ్రమలో కొనసాగినా తనకు తగినంత గుర్తింపు రాలేదన్న అభిప్రాయం ఆమెలో ఉంది. కొంతకాలంగా ఆమె అవకాశాలు రాలేదు. వేషాల కోసం ఆమెను ఎవరూ సంప్రదించలేదు.
ప్రస్తుతం విక్రమ్ భట్ చేస్తున్న వెబ్ సిరీస్ మొత్తం 10 ఎపిసోడ్ లుగా ఉంటుంది. ఈసారి సన్నీని పోర్న్ స్టార్ గా కాకుండా మంచి యాక్షన్ భామగా చూడొచ్చు. తుపాకులతో కాల్చడం, ఫైట్స్ చేయడం లాంటి సన్నివేశాల్లోనూ ఆమె నటించబోతోంది. దీన్ని ఎమ్మెక్స్ ప్లేయర్ లో విడుదల చేయనున్నారు.
ఇటీవలే ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ ప్రారంభమైంది. విడుదల తేదీ ఎప్పుడన్నది ఇంకా తెలియరాలేదు. ఎప్పుడో ప్రారంభం కావలసి ఉన్నా కరోనా కారణంగా షూటింగ్ కు ఆలస్యమైందని విక్రమ్ భట్ అంటున్నారు. సన్నీలియోన్ కు వరుసగా ఇలాంటి అవకాశాలే వస్తున్నాయి. ఆమె ఇంతకుముందు ‘బుల్లెట్’లో నటించింది. ఇది కూడా ఓటీటీ కోసం చేసిందే. ఓటీటీల్లో బోల్డ్ కంటెంట్ ప్రాధాన్యం ఉన్నంత కాలం సన్నీలియోన్ కు మంచి అవకాశాలే ఉంటాయి.
Must Read ;- సింగిల్ లైఫ్ పూర్తయిందన్న సులగ్న పాణిగ్రాహి
Also Read ;- ఎద ఎదలో.. ఎన్నెన్నో ‘షకీల’ గుండె పదనిసలు