విశాఖ జిల్లా యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు పంచాయతీ ఎన్నికల్లో లాలంకోడూరు వార్డుమెంబరు అభ్యర్దికి, అతని బంధువులకి ఫోన్ చేసి పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు బాధితుడు కన్నబాబు రాజుపై రాంబిల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎమ్మెల్యేని అరెస్టు చేశారు. అనంతరం ఆయనను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.
నేనే అంతా..
ఈ గ్రామానికి ఏం కావాలన్నా ఎవరు చేయాలి? నేనే చేయాలి.. ముఖ్యమంత్రి తర్వాత నేనే అంటూ ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఎమ్మెల్యే గారు. గ్రామనికి నీళ్లు, రోడ్డు, పెన్షన్లు.. ఇలా ఏవైనా సకాలంలో అందాలన్నా.. గ్రామంలోని పనులు ఏ ఆటంకం లేకుండా జరగాలన్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వ ప్రతినిధిని గెలిపిస్తేనే అన్నీ సవ్యంగా జరుగుతాయంటూ పరోక్షంగా ప్రజలను బెదిరించారు ఎమ్మెల్యే కన్నబాబు.
వేరే పార్టీని గెలిపిస్తే ఉంటదీ..
ఎమ్మెల్యే గారి మాటలు వింటుంటే.. వేరే పార్టీ వాళ్లని గెలిపిస్తే ప్రభుత్వ సౌకర్యాలు ప్రజలకు అందనివ్వమని పరోక్షంగా అంటున్నట్లుంది. దానిబట్టి చూస్తే.. రాష్ట్రంలో ఉండేది మా ప్రభుత్వం.. ఏది చేసినా మేమే చేయాలి.. కాబట్టి మమ్మల్నే గెలిపించాలని ఎమ్మెల్యే బహిరంగ బెదిరింపులకు దిగిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన ప్రజలు ఇప్పుడేగా బెదిరింపుల కేసుపైన బెయిల్ తీసుకున్నాం.. మళ్లీ అదే పనిచేస్తున్నావు అంటే.. చట్టమంటే ఏ మాత్రం భయం, గౌరవం కూడా లేవంటూ విమర్శిస్తున్నారు.
Also Read: కన్నబాబుపై తిరగబడిన జనం..











