తనపై ఎస్ ఈసీ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాంటూ కోర్టును ఆశ్రయించిన పెద్దిరెడ్డికి అనుకూలంగా తీర్పు వెలువడింది. ఎన్నికల కమిషన్, చిత్తూరు, గుంటూరు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఇచ్చిన ఆదేశాలను తప్పుబడుతూ ప్రెస్ మీట్‌లో ఎన్నికల కమిషనర్‌ని తూలనాడారు పెద్దిరెడ్డి. అంతేకాదు, కలెక్టర్లు, అధికారులు ఎన్నికల కమిషన్ ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డిని ఈనెల 21 వరకు ఇల్లు దాటకుండా చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కమిషన్. ఈ ఆదేశాలు సవాలు చేస్తూ కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు పెద్దిరెడ్డి. దీనిపై విచారించిన కోర్టు.. ఈ ఉదయం విచారణ ముగిసిన అనంతరం 12 గంటలకు తీర్పును వాయిదా వేసింది. రాష్ట్రపతి పర్యటనకు పెద్దిరెడ్డి అనమతులిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తాజాగా ఎస్ఈసీ ఆదేశాలపై తుది తీర్పును వెలువరించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలను కొట్టివేస్తున్నట్లుగా ప్రకటించింది. పెద్దరెడ్డి హౌస్ అరెస్ట్ ఆదేశాలు చెల్లవని కోర్టు స్పష్టం చేసింది. కానీ, పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడేందుకు వీలులేదని ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు సమర్ధించింది. ఎన్నకల అంశానికి సంబంధించి ఇకపై పెద్దిరెడ్డి మీడియా సముఖంగా మాట్లాడకూడదని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. అంతేకాదు, ఎన్నికల విషయంలో పెద్దిరెడ్డి జోక్యం ఉండకూడదని కూడా కోర్టు ఆదేశించింది.
Also Read: పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయండి..