అచ్చ తెలుగు అందం పేరే ఈషా రెబ్బా .. చక్కని కనుముక్కుతీరుతో ఆకట్టుకునే అందం ఈషా రెబ్బా సొంతం. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా ద్వారా ఈ సుందరి తెలుగు తెరకి పరిచయమైంది. అప్పటి నుంచి అంత స్పీడ్ గా కాకపోయినా సినిమాలు చేస్తూనే ఉంది. ‘ అరవింద సమేత వీరరాఘవ’ .. ‘రాగాల 24 గంటల్లో’ సినిమాలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ‘రాగాల 24 గంటల్లో’ సినిమా సూపర్ హిట్ కాకపోయినా, ఈషా అందంలోని హాటుదనం అందరికీ అర్థమైపోయింది. త్వరలో రానున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా ద్వారా కూడా ఆమె ప్రేక్షకులను పలకరించనుంది.
మిగతా హీరోయిన్లకు మాదిరిగానే ఈ అమ్మాయి కూడా సోషల్ మీడియాలో తన దూకుడు పెంచుతున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఇచ్చిన పోజుల్లో ఈ అమ్మాయి మంచి ఫిట్ నెస్ తో చూపులు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది. ఫిట్ నెస్ విషయంలో ఈ పిల్ల చాలా కేర్ తీసుకుంటుందనే విషయం అర్థమైపోతోంది. ఈ తెలుగు అమ్మాయిలో ఇంత అందం దాగుందా అన్నట్టుగా ఆశ్చర్యపరుస్తోంది. మంచి హైటూ .. ఆకర్షణీయమైన రూపం కావడంతో కుర్రాళ్ల గుండె గదులకు ఖాళీ చేస్తోంది. టైట్ ఫిట్ డ్రెస్ లో ఈ అమ్మాయి అందాల శిల్పమే! కుర్రాళ్ల తలపుల తల్పమే!!
ఈ మధ్యనే ఈషా రెబ్బాకి గుర్తింపు పెరుగుతూ వస్తున్నట్టుగా అనిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళంలోను ఆమె తన జోరు చూపడానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. గుణశేఖర్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘శాకుంతలం’లో కథానాయిక స్నేహితురాలి పాత్ర ఈషా రెబ్బాకి దక్కింది. ఇది చిన్న పాత్రేమీ కాదు .. సినిమాలో నాయికతో పాటు చాలాసేపు ట్రావెల్ అవుతుంది. ఇక మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాదిలో ఈషా రెబ్బా నిలదొక్కుకుంటుందేమో చూడాలి.











