సౌత్ లో సంగీత దర్శకుడిగా దేవీశ్రీప్రసాద్ క్రేజ్ గురించి తెలిసిందే. తాను సంగీతం అందించే ప్రతీ సినిమాలోనూ సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన ఘనత అతడిది. యువతరం మెచ్చే ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను కంపోజ్ చేశాడు అతడు. రీసెంట్ గా మహర్షి, ఉప్పెన చిత్రాల్లో అద్భుతమైన పాటలు అందించిన ఆయన .. త్వరలో రాబోయే పుష్ప, ఖిలాడీ, ఎఫ్3, రామ్ లింగుసామి చిత్రాలకు కూడా సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాట కూడా రాక్ స్టార్ ప్రభంజనం మామూలుగా లేదు.
ఇక తాజాగా దేవీ సల్మాన్, ప్రభుదేవా యాక్షన్ ప్యాక్డ్ మూవీ రాధే సినిమాకి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఇందులో దేవీశ్రీ మార్క్ సీటీమార్ సాంగ్ .. అదరగొట్టేసింది. ఈ ట్రైలర్ మొత్తానికి ఆ బీట్ నే హైలైట్ చేశారు. 2017 లో బన్నీ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాథంలో దేవీ కంపోజ్ చేసిన ఈ పాట .. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ సల్లూభాయ్ కోసం దేవీ రాధే సినిమా కోసం ఈ పాటను రీ క్రియేట్ చేశాడు.
ఈ పాటను అద్భుతంగా కంపోజ్ చేశావంటూ.. సల్మాన్ ఖాన్ దేవీని మెచ్చుకున్నాడట. గతంలో ఆర్య సినిమాలోని రింగరింగ పాటను సల్మాన్ .. రెడీ సినిమా కోసం ఢింకిచికా అంటూ రీక్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా భాయ్ నుంచి దేవీకి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మరోసారి సీటీమార్ తో .. నార్త్ లో దేవీ మళ్ళీ విజిల్స్ వేయిస్తుండడం విశేషంగా మారింది. ఈ పాటను .. నేడే విడుదల చేస్తున్నారు. మరి రాధేలో మిగతా పాటల్ని ఏ రేంజ్ లో దేవీ కంపోజ్ చేశాడో చూడాలి.
Must Read ;- బహుముఖ విడుదల దిశగా సల్మాన్ ‘రాధే’











