టాలీవుడ్ లో అజేయదర్శకుడిగా కొనసాగుతున్నాడు కొరటాల శివ. ‘మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను’ మూవీస్ తో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. సందేశాత్మక కథలతో కమర్షియల్ సినిమాలు తీసే కొరటాల శైలిని తెరమీద బాగా ఎలివేట్ చేయడంలో సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ హ్యాండ్ ప్రధానంగా ఉంది. కొరటాల శివ అన్ని సినిమాలకు దేవీ సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించాడు. ఒక విధంగా చెప్పాలంటే.. కొరటాల మార్క్ సినిమాలకు దేవీశ్రీ సంగీతం ల్యాండ్ మార్క్ గా నిలిచింది.
అయితే మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాతో కొరటాల శివ తన కెరీర్ లో తొలిసారిగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ తో వర్క్ చేస్తున్నాడు. మాస్ యాక్షన్ సినిమాలకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడంతో పాటు.. అంతకన్నా అదిరిపోయే పాటలను కంపోజ్ చేయడంలో ఆయన మాస్టర్. ఆ విషయం ఆల్రెడీ ‘ఆచార్య’ విషయంలో ప్రూవ్ అయింది. టీజర్ కు మైండ్ బ్లోయింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన మణిశర్మ.. ఆ మధ్య విడుదలైన లాహే లాహే పాటకు తన స్టైల్ ఆఫ్ బీట్ తో చెలరేగిన సంగతి తెలిసిందే. అందుకే కొరటాల శివ .. మణిశర్మ మాస్టారితో తన ప్రయాణాన్ని కంటిన్యూ చేసే ఉద్దేశంలో ఉన్నాడట.
రీసెంట్ గా యన్టీఆర్ 30వ సినిమాకి దర్శకుడిగా కొరటాల శివ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాకి కూడా మణిశర్మ సంగీతం అందించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ‘ఆచార్య’ విషయంలో మణి వర్క్ స్టైల్ కి ఫిదా అయిన కొరటాల .. దేవీశ్రీ ప్రసాద్ సెంటిమెంట్ ను పక్కన పెట్టి.. ఈ సినిమాకి కూడా ఆయన్నే సంగీత దర్శకుడిగా ఎంపిక చేశాడట. అలాగే.. యన్టీఆర్ సినిమాలకు కూడా మణిశర్మ గతంలో అదరగొట్టే సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అందుకే యన్టీఆర్ కొరటాల నిర్ణయాన్ని కాదనలేదట. మరి నిజంగానే యన్టీఆర్ 30కి మణిశర్మే సంగీతం అందిస్తున్నాడో లేదో తెలియాలంటే.. కొద్దిరోజులు ఆగాల్సిందే.
Must Read ;- తారక్ కొరటాల శివకి మరో భరత్ అవుతాడా?