సెకండ్ వేవ్ దేశాన్ని పట్టిపీడిస్తోంది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల్లో మరణాల సంఖ్య పెరుగుతోంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు, సెలబ్రిటీలు చనిపోతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ప్రముఖ యూట్యూబ్ యాంకర్, నటుడు టీఎన్ ఆర్ కరోనాతో చనిపోయారు. టీఎన్ఆర్ మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘టీఎన్ఆర్ మరణ వార్త నన్ను ఎంతగానో బాధించింది. అటు జర్నలిజం, ఇటు యాక్టింగ్ రెండింటిలోనూ రాణించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తున్నా’’ అంటూ సంతాపం తెలిపారు లోకేశ్.
Saddened to hear the news about the passing of film journalist TNR who lost his battle with COVID. My deepest sympathies go out to his family and friends in this hour of grief. pic.twitter.com/Riulo40Zbj
— Lokesh Nara (@naralokesh) May 10, 2021











