ప్రస్తుతం యన్టీఆర్ … రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా కేటగిరిలో బహుభాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకి అక్టోబర్ 13న రిలీజ్ డేట్ లాక్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణను ముగింపు దశకు తీసుకొచ్చాడు జక్కన్న.
ఇక ఈ సినిమా తర్వాత యన్టీఆర్ చేయబోయే 30వ సినిమాపై అభిమానుల్లో చాలా ఆసక్తి ఉంది. సందేశాత్మక కథలతో కమర్షియల్ చిత్రాలు తీసి.. అజేయ దర్శకుడు అనిపించుకున్న కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న నేపథ్యంలో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
గతంలో యన్టీఆర్ తో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల శివ .. ఈ సారి ఎలాంటి కథతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తాడు అనే విషయంలో అందరిలోనూ ఆత్రుత పెరిగిపోయింది. తాజా సమాచారం ప్రకారం కొరటాల తారక్ తో ఈ సారి పాలిటికల్ థ్రిల్లర్ ను రూపొందించబోతున్నాడనే వార్తలొస్తున్నాయి. ఆల్రెడీ మహేశ్ బాబు తో ఇదే కథాంశంతో భరత్ అనే నేను అనే సినిమాను తీసినప్పటికీ.. ఆ కథకి, ఈ కథకి చాలా వ్యత్యాసం ఉంటుందని సమాచారం.
ప్రజల సమస్యలతో పోరాడే ఒక సామాన్య యువకుడు రాజకీయాల్లోకి చేరి.. అక్కడ ఎలాంటి మార్పులు తీసుకొస్తాడు అనే పాయింట్ తో ఒక చక్కని సందేశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తాడట కొరటాల. యన్టీఆర్ ను అభిమానులు ఎలాగూ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు కాబట్టి.. అతడికి ఈ సినిమా చాలా అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నారట. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీతో తారక్ ఎలాగూ.. పాన్ ఇండియా స్టార్ గా మారతాడు కాబట్టి.. కొరటాల శివ ఈ సినిమా ను కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.
Must Read ;- తారక్, కొరటాల శివ సినిమాలో విలన్ ఇతడేనా?