ఎవరికి వారు వారి టీకా సామర్థ్యాన్ని నిరూపించడానికి, పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నాయి. అందులో ఫైజర్ టీకా కూడా ఒకటి. ఇటీవల తమ టీకా సామర్థ్యం 95 శాతం కలిగి ఉందని అధికారకంగా ప్రకటించిందీ సంస్థ. నిజంగా, ఇది మొత్తం ప్రపంచానికే ఎంతో ఆనందించదగ్గ విషయం అని చెప్పాలి. మరి ఫైజర్ టీకా పూర్తివివరాలిలా ఉన్నాయి…
130 కోట్ల డోసులు
కరోనా టీకా తయారు చేయడంలో ఫైజర్ వడివడిగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా-జర్మనీలకు చెందిన ఫైజర్-బయోఎన్ టెక్ సంస్థలు కలిసి ఈ కరోనా టీకాను తయారుచేస్తున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన ప్రయోగాల ఆధారంగా టీకా సామర్థ్యం 95 శాతం ఉన్నట్లు అధికారక ప్రకటన విడుదల చేసింది. కేవలం యువతపైనే కాదు, 65 సంవత్సరాలు పైబడిన వారిపైన కూడా ఈ టీకా సమర్ధవంతంగా పనిచేస్తుందని తెలియజేశాయి సంస్ధలు. అంతేకాదు ఈ ఏడాదిలో 5 కోట్లు, వచ్చే ఏడాది చివరి నాటికి 130 కోట్ల డోసులు ఉత్పత్తి చేయాలనే లక్ష్యం నిర్ధేశించుకున్నట్లు కూడా వెల్లడించాయి.
ఆశాజనకంగా ఫలితాలు
ఇప్పటి వరకు జరిగిన ప్రయోగాలలో టీకా సామర్థ్యం అనుకున్నట్లుగా నిరూపించుకుందని సంస్థ వెల్లడించింది. వైరస్ సోకిన వారికి, వైరస్ సోకని వారి పైన కూడా ప్రయోగాలు నిర్వహించి వాటి ఫలితాలను పరిశీలించిన మీదటే ఈ ప్రకటన చేసినట్టు సంస్ధ ప్రకటించింది. ప్రయోగాలకు అన్నీ వయసుల వారిని, వ్యాధుల వారిని కూడా పరిగణలోకి తీసుకుని ప్రయోగాలు నిర్వహించారు. అన్నీ దేశాల ప్రయోగ ఫలితాల ప్రకారం ఫైజర్ టీకా 95 శాతం సామర్ధ్యం నమోదు చేయడం విశేషం. వ్యాధి తీవ్రంగా ఉన్నవారిపైన కూడా మంచి ఫలితాలు అందుకుందీ టీకా. అంతేకాదు, టీకా డోసును కూడా ఈ ప్రయోగాల తర్వాత నిర్ధారించినట్లు తెలుస్తుంది.
Must Read ;- పబ్లిక్ డౌట్ : ఇంతకీ కేటీఆర్ కొవిడ్ వాక్సిన్ తీసుకున్నారా?
ప్రయోగాల వివరాలు
ఫైజర్ టీకా ప్రయోగం జులైలో మొదలైంది. అప్పటి నుంచి నవంబర్ వరకు జరిగిన ప్రయోగాల వివరాల ప్రకారం ఈ టీకా సామర్థ్యంను నిర్ణయించాయి కంపెనీలు. మూడు దశల్లో జరిగిన ఈ ప్రయోగాల్లో 18 ఏళ్ల వయసు వారి నుండి 65 సంవత్సరాలు పైబడిన వారిని పరిగణలోకి తీసుకున్నారు. వీరితో పాటు కరోనా సోకని వారికి, కరోనా సోకిన వారికి, వివిధ వ్యాధులు ఉన్నవారికి కూడా ఈ నిర్ణేత డోసులను ఇచ్చారు. ఈ ప్రయోగాల్లో దాదాపు 40 వేల మందికి పైగా వాలంటీర్లు పాల్లొన్నారు. ఇందరిలో కేవలం స్వల్ప శాతం మాత్రమే తలనొప్పి, నీరసం వంటివి లక్షణాలు ఉన్నట్లు నమోదయ్యాయి. అధిక శాతం మందిపైన ఈ టీకా సమర్థంగా పనిచేయడంతోపాటు ఎటువంటి అనారోగ్య సమస్యలు నమోదు కాలేదు.
ఎమర్జెన్సీ అనుమతికి దరఖాస్తు
ప్రస్తుత పరిస్థితుల్లో టీకా అవసరం చాలా ఎక్కువగా ఉన్నందున ఈ ప్రయోగా ఫలితాల ఆధారంగా ఎమర్జెన్సీ అనుమతి కోసం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ కి దరఖాస్తు చేసుకోబోతున్నట్లు వెల్లడించారు సంస్ధ అధికార ప్రతినిధి. ఒక వేళ ఈ అనుమతులు లభిస్తే, టీకా డోసులు ఉత్పత్తి చేసి వాటిని నిల్వుంచడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది. అంతేకాదు, ఎక్కడికైనా సురక్షితంగా తరలించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read ;- కొవిడ్ వేక్సిన్ అప్‌డేట్ ఇదే : ఆశలు చిగురిస్తున్నాయి