ఈ ఇద్దరూ ఇద్దరే… ఒకరు అక్కినేని నట వారసుడు నాగచైతన్య భార్య సమంత అయితే, ఇంకొకరు మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన. వీరిలా పోజు ఇచ్చారేంటా అనేగా మీ సందేహం. ఇద్దరికీ సామాజిక సేవ ఎక్కువే. తాము ఏంచేసినా జనానికి ఏదో ఒక సందేశం పంపాలని తాపత్రయపడుతుంటారు. సామాజిక బాధ్యతగానూ వీరు దీన్ని ఫీలవుతుంటారు. ఓ పక్క ఒకరికి నట, ఇంకొకరికి వ్యాపారాలు తమ వృత్తే అయినా, ఇంకో పక్క జనాన్ని ఏదో ఒక రకంగా ఆదుకోవడం మీద దృష్టిపెడుతుంటారు.
అక్కినేని కోడలు సమంత ప్రత్యూష సామాజిక సంస్థ ద్వారా అంగవైకల్యం ఉన్నవారికి, పేద ఆడపిల్లలకు సహాయం చేస్తున్నారు. ఇక ఉపాసన గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె సామాజిక మాధ్యమాల్లో కూడా చురుకుగా ఉంటారు. అపోలో హెల్త్ ఆర్గనైజర్ గా మ్యాగజైన్ ఎడిటర్ గా ఉపాసన సేవల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈ ఇద్దరూ ఇకపై ఓ వెబ్ సైట్ వేదికగా ఉపయోగించుకోబోతున్నారు. తాము చేపట్టే మంచి పనులను ఇక్కడి నుంచి ప్రారంభించాలన్నది వీరి లక్ష్యం.
“సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే అత్యంత దయగల శక్తిమంతమైన స్టార్ భార్యలు అద్భుతాల కోసం వస్తున్నారు. వేచి ఉండండి! @ Urlife.co.in ను అనుసరించండి“ అంటూ సోషల్ మీడియాల్లో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. ఇక సమంత- ఉపాసన ఈ వేదిక ద్వారా ఏమేం చేస్తారో చూడాలి. మంచికి మేము సైతం అంటూ వీరు బరిలో దిగితే.. స్వాగతించకుండా ఎవరుంటారు చెప్పండి. అభిమానులు కూడా ఆత్రంగా వీరు చేపట్టే పనుల కోసం ఎదురుచూస్తున్నారు.











