మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడూ లేని విధంగా నాలుగు సినిమాల అప్ డేట్స్ ఇవ్వడం తెలిసిందే. ఆచార్య సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. మెహర్ రమేష్ డైరెక్షన్ లో చేయనున్న మూవీకి భోళా శంకర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దీనిని మహేష్ బాబు చేతుల మీదాగా రిలీజ్ చేయించారు. లూసీఫర్ మూవీ రీమేక్ కి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేయడం.. అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సినిమాలతో పాటు చిరంజీవి బాబీ డైరెక్షన్ లో చేయనున్న మూవీకి సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేయడం కూడా జరిగింది.
అయితే.. ఈ మూవీకి వీరయ్య అనే టైటిల్ ఫిక్స్ చేశారని ఈ టైటిల్ ను కూడా అనౌన్స్ చేస్తారని అనుకున్నారు కానీ.. వీరయ్య అనే టైటిల్ ను మాత్రం అనౌన్స్ చేయలేదు. కారణం ఏంటంటే.. ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.. బాబీ వీరయ్య టైటిల్ తోనే ఈ కథ రాశాడట. కథ చెప్పినప్పుడే టైటిల్ వీరయ్య అని చెప్పాడట. చిరు కూడా ఓకే అన్నారట. అయితే… ఇప్పుడు వీరయ్య టైటిల్ విషయంలో చిరు సందిగ్థంలో పడినట్టు సమాచారం. ఈ టైటిల్ మరీ పాత వాసన కొడుతోందని కొంత మంది సన్నిహితులు చిరుకి చెప్పారట.
దాంతో.. చిరు ఈ టైటిల్ విషయంలో ఆలోచనలో పడ్డారట. అంతే.. ఈ టైటిల్ పక్కన పెట్టి కొత్త టైటిల్ గురించి ఆలోచించమని బాబీకి ఆర్డర్ వేశారట. ఇప్పుడు బాబీ కొత్త టైటిల్ గురించి ఆలోచిస్తున్నారని.. అందుచేత వీరయ్య అనే టైటిల్ దాదాపు లేనట్టే అని సమాచారం.
Must Read ;- ఇట్స్ అఫిసియల్ చిరు మూవీ టైటిల్ గాడ్ ఫాదర్.











