మహానటిని మంచి అవకాశాలు వరిస్తున్నాయి. రజినీకాంత్ తో ‘అన్నాత్తే’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశం కూడా కీర్తి సురేష్ వచ్చిందట. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ చేస్తున్నారు. దీని తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసీఫర్’ రీమేక్ ప్రారంభం అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుకు ముందే ఈ సినిమా ప్రారంభం లాంఛనంగా జరగబోతున్నట్లు సమాచారం. దీంతో పాటు బాబి దర్శకత్వంలో ఓ సినిమా, మెహర్ రమేష్ దర్శకత్వంలో మరో సినిమాని చిరంజీవి అంగీకరించారు.
మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందే సినిమా కోసం కీర్తిసురేష్ ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. అన్నాత్తేలో రజినీకి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ సినిమాలో కూడా ఆమెను చెల్లిలి పాత్రే వరించిందని తెలుస్తోంది. తమిళ సినిమా ‘వేదాళం’ రీమేక్ గా రూపొందే ఇందులో చెల్లి పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. తమిళంలో అజిత్ కు జోడీగా శృతి హాసన్ నటించగా, చెల్లిగా లక్ష్మీ మీనన్ కనిపించింది. ఇప్పుడు రీమేక్ లో లక్ష్మీ మీనన్ చేసిన పాత్ర కోసం కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్టు సమాచారం.
మొదట ఈ పాత్ర కోసం సాయి పల్లవి పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. ఈ పాత్రకోసం కీర్తి భారీ పారితోషికం డిమాండు చేసినట్టు తెలుస్తోంది. నవంబరు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన చిరు పుట్టిన రోజు రావచ్చు. శక్తి, షాడో సినిమాల తర్వాత మెహర్ రమేష్ ఈ సినిమా మీద దృష్టి పెట్టారు. మెగాస్టార్ చిరంజీవికి మెహర్ రమేష్ దగ్గరి బంధువు కూడా కావడం విశేషం. అందువల్ల గత ఫ్లాప్ ల ప్రభావం పడకుండా చాలా జాగ్రత్తగా ఈ ప్రాజెక్టును డీల్ చేయాలని మెహర్ భావిస్తున్నారు. ఏంజరుగుతుందో చూడాలి.











