సంగం డెయిరీ వ్యవహారంలో అరెస్టై విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సంస్థ ఛైర్మన్ దూళిపాళ్ల నరేంద్రను ఐసోలేషన్లో ఉంచాలని డాక్లర్లు చెబుతున్నా రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎలా తరలించారని ఏసీబీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న దూళిపాళ్లను కోర్టు అనుమతి తీసుకోకుండా రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎందుకు తరలించారని ఏసీబీ కోర్టు ప్రశ్నించింది.కనీసం మరో వారం రోజులు దూళిపాళ్లను ఐసోలేషన్లో ఉంచాలని వైద్యులు చెప్పినా,జైలుకు ఎలా తరలించారని ఏసీబీ కోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది.వెంటనే దూళిపాళ్లను రాజమండ్రిలోని ప్రైవేటు ఆసుపత్రికి లేదంటే విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. కోవిడ్ వచ్చిన వారు 14 రోజులు ఆసుపత్రిలో,ఐసోలేషన్లో ఉండాలని తెలిసినా రాజమండ్రి జైలుకు తరలించడంపై ఏసీబీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏసీబీ అదుపులో సంగం డెయిరీ సెక్రటరీ
సంగం డెయిరీ కార్యదర్శిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.సంగంలో అక్రమాలపై ఇప్పటికే ఆ సంస్థ చైర్మన్,ఎండీలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.తాజాగా సంగం డెయిరీ సెక్రటరీ సందీప్‌తో పాటు మరికొందరు సిబ్బందిని ఏసీబీ అధికారులు తమ వాహనాల్లో తీసుకెళ్లారు.సంగం డెయిరీకి చెందిన ల్యాప్ టాప్‌తో పాటు పలు కీలక పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ నెల16కల్లా సంగం డెయిరీ అక్రమాలపై దర్యాప్తు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఏసీబీ అధికారులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.











