పవన్ కల్యాణ్ అభిమానులు ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. బుధవారం తమ హీరో పుట్టిన రోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ.. బ్యానర్ కట్టడానికి ఫ్యాన్స్ సిద్ధ పడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పం లో వారు బ్యానర్ కడుతుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మరణించారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో మంగళవారం రాత్రి తీవ్ర విషాదం నెలకొంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా కుప్పంలో బుధవారం ఆయన అభిమానులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని కూడలి ప్రాంతాల్లో పలుచోట్ల ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. కుప్పం నుంచి వీకోట వెళ్లే ప్రధాన రహదారిపై బ్యానర్లు కడుతుండగా విద్యుత్ స్తంభం నుంచి విద్యుత్ షాప్ కొట్టడంతో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో లో అరుణాచలం, రాజేంద్ర, సోమశేఖర్ మృతి చెందారు. మరో నలుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ అభిమానులు, మృతుల బంధువులు కుప్పం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. జరిగిన ఈ సంఘటనపై విషాదంలో మునిగిపోయారు.