తమిళంతో పాటు తెలుగులోను హిట్ అయిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’. ఇందులో కార్తీ హీరోగా నటించాడు. ‘నగరం’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. యావజ్జీవ శిక్ష పడిన ఒక ఖైదీ సత్ప్రవర్తనతో బయటికి వస్తాడు. ఎలా ఉంటుందో తెలియని కూతురు కోసం తపన పడుతూ ఉంటాడు ఆ ఖైదీ. అలాంటి తండ్రి పాత్రలో కార్తి నటన ఈ సినిమాకు ప్రధాన బలంగా చెప్పుకోవాలి. దీపావళి కానుకగా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ‘ఖైదీ’.
అలాంటి ఈ సినిమాను హిందీ భాషలో అజయ్ దేవగణ్ హీరోగా రీమేక్ అవుతోంది. ఈ సినిమాను రిలయన్స్ ఎంటెర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాపై మరొక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ ‘ఖైదీ’ హిందీ రీమేక్ సినిమాలో అజయ్ దేవగణ్ భార్య పాత్రలో సీనియర్ హీరోయిన్, అజయ్ భార్య అయిన కాజోల్ ను ఎంపిక చేసారని సమాచారం. కాజోల్ అయితే ఈ పాత్రకు పూర్తి న్యాయం చేస్తుందని దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదించారట.
ఈమధ్యే ఆమె కథ పూర్తిగా విని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని బాలీవుడ్ టాక్. ఈ సినిమా షూటింగ్ ను డిసెంబర్ నెలలో మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్ లోనే పూర్తి చేయాలని హీరో అజయ్ దేవగణ్ భావిస్తున్నాడట. ‘ఖైదీ’ సినిమా హీరో మీద, మాస్ ఎంలిమెంట్స్, ఫాధర్, డాటర్ ఎమోషన్ మీదే నడుస్తుంది కాబట్టి ఈ చిత్ర కథ హిందీ ప్రేక్షకులకి కొత్త అనుభూతినిస్తుంది అనడంలో సందేహం లేదు. అందులోనూ బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న సీనియర్ నటుడు అజయ్ దేవగణ్ ‘ఖైదీ’ సినిమాను రీమేక్ చేస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కార్తి ఈ చిత్రం ద్వారా మంచి కలెక్షన్స్ రాబట్టాడు. మరి అజయ్ దేవగన్ హీరోగా ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తోందో చూడాలి.










