రాజమౌళి ఆర్.ఆర్.ఆర్. మూవీ తాజా అప్ డేట్ ఈ సినిమా ఫైట్స్ మీద క్రేజ్ ను అమాంతం పెంచేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంట్రి క్రేజీ కాంబినేషన్ కు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ఉంటే బాగుంటుందని రాజమౌళికి అనిపించినట్టుంది. వెంటనే రంగంలోకి దించేశారు. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ ఈ సినిమా కోసం పనిచేయడం ప్రారంభించారు. నిన్న సాయంత్రం ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ అప్ డేట్ ఇచ్చింది. ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేశారు. ఈ సినిమా క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. నిక్ పావెల్ సెట్ లో అడుగుపెట్టాడు. యాక్షన్ సీన్ కు సంబంధించి నిక్ పావెల్ చేసే సూచనలతో ఓ వీడియో విడుదల చేశారు.
క్లైమాక్స్ లో ఊపు ఉండటం కోసం నిక్ పావెల్ వచ్చేశాడు అంటూ చిత్ర బృందం పేర్కొంది. ఇక నిక్ పావెల్ లోని ప్రత్యేకత గురించి కూడా చెబితే బాగుంటుంది. కత్తి యుద్ధం అతని ప్రత్యేకత. ఒకప్పుడు బ్రిటన్ వూషూ టీమ్ నుంచి యూరోపియన్ ఛాంపియన్ గా నిలిచాడు. అనేక హాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ డైరెక్టర్ గా పనిచేశాడు. గ్లాడియేటర్, మమ్మీ, ది లాస్ట్ సమురాయ్, సిండ్రెల్లా మ్యాన్, బ్రేవ్ హార్ట్ లాంటి చిత్రాలకు ఆయన ఫైట్స్ కంపోజ్ చేశారు. బాలీవుడ్ లో కూడా కొన్ని చిత్రాలకు పనిచేశారు. రౌద్రం రణం రుధిరం పేరుతో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోలకు వివిధ రకాల గెటప్పులు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. బ్రిటీషు అధికారులను బురిడీ కొట్టించడం కోసం వీరికి ఇలాంటి గెటప్పులు వేశారట.
కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించినా ఇందులో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయనది బందిపోటు పాత్ర. ఈ సినిమాకి ఈ గెటప్పులు కూడా ఓ ప్రత్యేక ఆకర్షణ అంటున్నారు. అక్టోబరు 13న ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే తమిళ నటుడు సముద్రఖని కూడా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని అప్ డేట్ లు వచ్చే అవకాశం ఉంది.
Renowned Hollywood Action Director, Nick Powell, joins the last leg of climax. Just when you thought the climax shoot couldn't get any 🔥 #RRRDiaries…#RRR #RRRMovie pic.twitter.com/RnTcVYi3hs
— RRR Movie (@RRRMovie) March 2, 2021
Must Read : ‘ఆర్ఆర్ఆర్’ తొలి రోజు కలెక్షన్ 200 కోట్లని జోస్యం చెబుతున్నాడు.. !