తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కలవర పాటుకు గురి చేస్తోంది. యూకే నుండి వచ్చిన వారిలో ఈ వైరస్ ఛాయలు కనిపిస్తుండటంతో ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్య అధికారులు సైతం ఎప్పటికప్పుడు ఈ స్ట్రైయిన్‌పై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రూపాంతరం చెందిన వైరస్ వేగంగా విస్తరిస్తుందని.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. ఇక దీనిపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని.. ఇది ప్రాణాంతకం కాకపోయినా అప్రమత్తంగా ఉండటం శ్రేయస్కరమంటున్నారు వైద్యరంగ నిపుణులు.
విద్యారంగంపై ప్రభావం..
దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం విద్యారంగంపై పడింది. తెలంగాణలో ఈ విద్యా సంవత్సరంలో ఒక్క రోజు కూడా పాఠశాలలు ఓపెన్ కాలేదు. ఉన్నత పాఠశాలలు, కళాశాలలు సైతం ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహిస్తూ విద్యా సంవత్సరం వృథా కాకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఇక పరీక్షలు కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నాయి యాజమాన్యాలు . ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్ష చేసుకుని విద్యా సంవత్సరం ఎప్పటి నుండి ప్రారంభించాలన్న దానిపై సమాలోచనలు చేస్తూ వచ్చింది. ఇప్పటికే రెండు మూడు సార్లు పాఠశాలల రీ ఓపెనింగ్ గడువును పొడగించింది రాష్ట్ర ప్రభుత్వం. కోవిడ్ వ్యాక్సిన్ వస్తే కొత్త ఏడాది విద్యా సంవత్సరాన్ని ప్రారంభించ వచ్చని ప్రభుత్వం, అధికారులు నిర్ణయానికి వచ్చారు. అంతా ఒకే అయితే సంక్రాంతి తరువాత స్కూళ్లు ఓపెన్ చేయాలని కూడా నిర్ణయించినట్టు తెలసింది.
Must Read ;- కరోనా వ్యాక్సిన్ డ్రైరన్‌కు రంగం సిద్దం.
ప్రైమరీ విద్యా సంవత్సరం రద్దు..
భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటికే యూకే నుండి వచ్చిన వారిలో పదుల సంఖ్యలో కొత్తరకం కరోనాను గుర్తించామని తెలిపింది. తెలంగాణలో సైతం 20 మందికి పైగా ఈ కరోనా లక్షణాలు గుర్తించామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, వారికి ఇప్పుడే యూకే బేస్డ్ వైరస్ వచ్చిందని భావించలేమని .. పూణే ల్యాబ్‌కు పంపిన శాంపిల్స్ రిపోర్ట్స్ వస్తే గాని చెప్పలేమంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా విద్యా శాఖ అప్రమత్తం అయ్యింది. ఒకటో తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యా సంవత్సరాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. చిన్నారుల్లో ఈ కొత్త కరోనా ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతుండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. వీరిని నేరుగా పై తరగతికి ప్రమోట్ చేయాలని నిర్ణయించారు.
సంక్రాంతి తరువాత 9,10 తరగతులతో పాటు ఇంటర్ , డిగ్రీ కళాశాలలు ఓపెన్ చేయాలని నిర్ణయించిన అధికారులు…అప్పటి పరిస్థితులను బట్టి విద్యార్థులను ప్రమోట్ చేయాలా లేక విద్యా సంవత్సరం కొనసాగించాలో నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. మొత్తానికి కరోనా సెకండ్ వేవ్ ప్రభావం విద్యా సంవత్సరంపై పడింది. దీని ప్రభావం ఏ మేరకు ఉంటుంది.. హైయర్ క్లాస్ లను అయినా నడిపించేందుకు అవకాశం కలుగుతుందా లేదా అన్నది సంక్రాంతి తరువాత తేలనుంది.
Must Read