వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామని, అప్పుడు చంద్రబాబును అడిగి తానే హోంమంత్రి పదవి తీసుకుని అరాచక పోలీసుల అంతు చూస్తానని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసుల తీరుపై ఆయన మండి పడ్డారు. అరెస్టు సందర్భంగా డీఎస్పీ, సీఐలు తన బెడ్రూంలోకి రావడంపై ఆయన ఆక్షేపించారు. నోటిసులిస్తే తానే స్టేషన్‌కు వచ్చే వాడినని, అక్రమ కేసులతో తమను ఇబ్బందులు పెడుతున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు.
Must Read ;- అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్