‘వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్ , హిట్’ లాంటి సినిమాలతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. కేవలం మాస్ అవతార్ తోనూ, రఫ్ అండ్ టఫ్ కేరక్టరైజేషన్స్ తోనూ తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్న ఈ యంగ్ హీరో .. లేటెస్ట్ గా నటిస్తోన్న మరో మాస్ లవ్ స్టోరీ ‘పాగల్’. దిల్ రాజు సమర్పణలో, బెక్కం వేణుగోపాల్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది.
ప్రస్తుతం హైద్రాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమాకి నరేశ్ కొప్పిలి దర్శకుడు. విశ్వక్ సేన్ ఎంతో ఉత్సాహంతో ప్రేమికుడి గెటప్ లో స్టైల్ గా కనిపిస్తోన్న ఈ ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఏప్రిల్ 30న సినిమాను విడుదల చేస్తున్నట్టూ ఈ పోస్టర్ లో తెలియపరిచారు మేకర్స్. విశ్వక్ సేన్ నటిస్తోన్న ఐదో చిత్రంగా విశేషాన్ని సంతరించుకున్న ‘పాగల్’ సినిమా అతగాడికి ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- దర్శకుడు వివేక్ ఆత్రేయ పెళ్లి ఫోటోలను షేర్ చేసిన నివేదా థామస్











