నందమూరి నట సింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన సినిమా కావడంతో అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను అఖండ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో అఖండ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది కానీ.. ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది. దసరాకి వస్తుంది అనుకుంటే రాలేదు. ఆతర్వాత దీపావళికి అఖండ విడుదల అనుకున్నారు.
ఇప్పుడు దీపావళికి కూడా రావడం లేదు. అయితే.. దీపావళికి అఖండ సినిమా రిలీజ్ కావడం లేదు కానీ.. అఖండ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వస్తుందని సమాచారం. ఆల్రెడీ అఖండ ఫస్ట్ కాపీ రెడీ అయిపోయి రిలీజ్ కి రెడీగా ఉంది. ఇంతకీ అఖండ రిలీజ్ డేట్ ఎప్పుడంటే.. డిసెంబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారని టాలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తోంది. అఖండ రిలీజ్ ఆలస్యం అవ్వడానికి మరో కారణం ఏపీలో టిక్కెట్ల రేట్లు. భారీ చిత్రాలకు రేట్లు పెంచుకునే అవకాశం కల్పించాలని నిర్మాతలు ఏపీ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
ఇదిగో వస్తుంరిలీజ్ది అదిగో వస్తుంది అనుకున్నారు కానీ.. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి టిక్కెట్ల రేట్లు పెంచుకునే విషయంలో సానుకూలంగా స్పందన రాలేదు. ఇక వెయిట్ చేసి లాభం లేదనుకున్నారో ఏమో కానీ.. అఖండ సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి డిసైడ్ అయ్యారని టాక్.
Must Read ;- బాలయ్యతో గీతా ఆర్ట్స్ మూవీ నిజమేనా?











