ఊర మాస్ డైరెక్టర్ అంటే ఠక్కున గుర్తుకువచ్చేది బోయపాటి శ్రీను. ప్రస్తుతం బోయపాటి శ్రీను.. నందమూరి నటసింహం బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్నారు. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కలిసి చేస్తున్న సినిమా కావడంతో అఖండ సినిమా పై అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఉన్నాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను దసరాకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 13న అఖండ రిలీజ్ అని వార్తలు వస్తున్నాయి. త్వరలో అఖండ అఫిషియల్ డేట్ అనౌన్స్ చేస్తారని సమాచారం.
ఇదిలా ఉంటే.. అఖండ తర్వాత బోయపాటి చేసే సినిమా ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. ముందుగా తమిళ స్టార్ హీరో సూర్యతో బోయపాటి సినిమా అంటూ వార్తలు వచ్చాయి. సూర్య తెలుగులో స్ట్రైయిట్ మూవీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ.. కుదరడం లేదు. ఇప్పుడు అంతా సెట్ అయ్యింది. బోయపాటి డైరెక్షన్ లో సూర్య సినిమా ఫిక్స్ అయ్యింది. దీనికి దిల్ రాజు నిర్మాత అంటూ టాలీవుడ్ లో గట్టిగా వార్తలు వినిపించాయి. అయితే.. ఏమైందో ఏమో కానీ ఈ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ కాలేదని తెలిసింది.
ఇక సూర్య తర్వాత బోయపాటి హీరో అంటూ బాగా వినిపించిన పేరు కేజీఎఫ్ హీరో యష్. అవును.. యష్ తో బోయపాటి మూవీ ఫిక్స్ అనుకున్నారు. రామ్ చరణ్ తో చేయాలనుకున్న కథతో బోయపాటి యష్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ.. ఈ ప్రాజెక్ట్ కూడా సెట్ కాలేదట. తాజా వార్త ఏంటంటే.. సూర్య, యష్ కాకుండా.. ఎనర్జిటిక్ హీరో రామ్ తో బోయపాటి తదుపరి చిత్రం ఫిక్స్ అయ్యిందని తెలిసింది. భారీ యాక్షన్ మూవీగా రూపొందే ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. రామ్ ప్రస్తుతం లింగుస్వామి డైరెక్షన్ లో తెలుగు, తమిళ్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత రామ్ – బోయపాటి మూవీ స్టార్ట్ కానుంది అంటున్నారు. మరి.. త్వరలో అనౌన్స్ చేస్తారేమో చూడాలి.
Must Read ;- ఆర్ఆర్ఆర్ డేట్ కి.. బాలయ్య అఖండ. ఇది నిజమేనా?