నందమూరి నటసింహం బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తుంది. సింహ, లెజెండ్ చిత్రాల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో అఖండ సినిమా పై అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
అయితే.. అఖండ సినిమా దసరాకి వస్తుంది అని వార్తలు వచ్చాయి. ఇటీవల ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు అనూహ్యమైన స్పందన వస్తుంది. ఇదిలా ఉంటే.. అఖండ విడుదల పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దసరాకి వస్తుందని ప్రచారం జరుగుతుంది కానీ.. అఫిషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు. మరో వైపు మిగిలిన సినిమాలు దసరాకు వచ్చేందుకు రెడీ అవ్వడం.. ప్రమోషన్ స్టార్ట్ చేయడంతో అఖండ సినిమా దసరా బరిలో లేదు అనేది వాస్తవం అని చెప్పచ్చు. దీంతో బాలయ్య అభిమానులు అఖండ విడుదల ఎప్పుడు అంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
సంక్రాంతికి అఖండ చిత్రాన్ని విడుదల చేస్తారనుకుంటే.. అక్కడ ఆల్రెడీ పెద్ద పోటీ ఉంది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, మహేష్ బాబు సర్కారు వారి పాట, ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలు సంక్రాంతికి వస్తున్నట్టు అనౌన్స్ చేసాయి. ఈ సినిమాలే కాకుండా నాగార్జున బంగార్రాజు, వెంకటేష్ ఎఫ్ 3 సినిమాలు సంక్రాంతికి రెడీ అవుతున్నాయి. కొత్తగా ఆర్ఆర్ఆర్ కూడా సంక్రాంతికి వస్తుంది అని టాక్ వినిపిస్తుంది. అందుచేత అఖండ సంక్రాంతికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. మరి.. ఎప్పుడు వస్తుంది అంటే.. దీపావళి అఖండ టార్గెట్ అని టాక్ వినిపిస్తోంది. దీపావళికి పెద్దగా పోటీ ఏమీ లేదు. అందుచేత అఖండ దీపావళికి రావడం ఖాయం అంటున్నారు. మరి.. త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Must Read ;- బాలయ్య నెక్ట్స్ మూవీ టైటిల్ ఇదే











