విశాఖ ఉక్కు ప్రయివేటీకరణలో కంద్రంలోని బీజేపీతో రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం కుమ్మక్కయిందని టీడీపీ సీనియర్ నేత సి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన ఆస్తులను వెయ్యికోట్లకు కొట్టేసేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్లాన్ చేస్తున్నారన్నారు. తన బినామీ కంపెనీ పేర విశాఖ ఉక్కును కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. అలా కాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఈ కంపెనీని కొని ఆంద్రుల హక్కును కాపాడాలన్నారు. ఉత్తరాంధ్ర విధ్వంసానికి ఏ1. ఏ2లు కుట్రపన్నుతున్నారని, దీనికి పరాకాష్ట విశాఖ ఉక్కును ఫ్రయివేటీకరణ చేయాలనుకోవడమే అని అన్నారు. విశాఖ ఉక్కును కొట్టేయాలనే కేంద్రానికి తప్పుడు నివేదికను పంపారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపిన వీరు విశాఖ ఉక్కును కొనలేరా అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.
Must Read ;- విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. కాపాడుకుందాం రండి