‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ తండ్రీ కొడుకులుగా నటించిన సంగతి తెలిసిందే. తండ్రీ, కొడుకులుగా ఒకేసారి స్ర్కీన్ మీద కనిపించనప్పటికీ.. అంతటి ఇంపాక్ట్ సినిమాలో కనిపిస్తుంది. ఒకవేళ గానీ డ్యూయల్ రోల్స్ లో ప్రభాస్ తెరమీద కనిపిస్తే ఎలా ఉంటుంది? అభిమానులకు నిజంగా పండగే కదూ. అందుకే దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్’ లో ప్రభాస్ చేత మరోసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయిస్తున్నాడని టాక్.
తాజా సమాచారం ప్రకారం.. ‘సలార్’ లో ప్రభాస్ యువకుడిగానూ, వయసు మీద పడిన పాత్రను పోషిస్తున్నాడని తెలుస్తోంది. కేజీఎఫ్ లో రాఖీభాయ్ ను మించిన పాత్రలో ప్రభాస్ ను ఎలివేట్ చేయబోతున్నాడట దర్శకుడు. ఇందులో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ప్రభాస్ డ్యూయల్ రోల్స్ మాత్రం అభిమానుల్ని ఖచ్చితంగా అలరిస్తాయని చెప్పొచ్చు.
శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళ సంగీత దర్శకుడు జెస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న సలార్ .. పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మరి ప్రభాస్ డ్యూయల్ రోల్స్ తో సలార్ ఏ రేంజ్ మ్యాజిక్ చేస్తుందో చూడాలి.











