వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్కే రోజా ప్రస్తుతం ఇంటిపట్టునే ఉంటున్నారు. ఇటీవలే రెండు శస్త్ర చికిత్సలు జరగ్గా, చెన్నైలోని సొంతింట్లోనే కోలుకుంటున్నారు. వీడియో కాన్ఫరెన్సుల ద్వారా సొంత నియోజకవర్గం నగరిలోని అధికారులు, నేతలకు కీలక ఆదేశాలిస్తున్నారు. మళ్లీ వర్క్ మోడ్ లోకి వస్తుండటం.. ఆరోగ్యం కుదుటపడుతుండటంతో రోజా జబర్ధస్త్ లోకీ ఎంట్రీ ఇవ్వానున్నారనే వార్తలు వినవస్తున్నాయి. షూటింగ్స్ కూడా గ్రీన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎంతకాలం జబర్ధస్త్ లో కొనసాగుతారనే విషయంపై సందేహాలు ఉన్నాయి. ఏపీలో మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందని, రోజాకు చోటు కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. అప్పటివరకు ఆమె టీవీ షోలు చేసే అవకాశం ఉందని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. ఏదీఏమైనా మళ్లీ జబర్ధస్త్ లోకి ఎంట్రీ ఇస్తుండటంతో ఆమె అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.
సౌత్ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..
ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...










