బుల్లితెరమీద హాట్ యాంకర్ గానూ, వెండితెరపై ప్రత్యేకపాత్రల్లోనూ మెరుస్తోన్న అచ్చ తెలుగందం అనసూయ భరద్వాజ్. పెళ్ళయి.. ఇద్దరు బిడ్డలకు తల్లైనప్పటికీ.. ఆమె హాట్ నెస్ లో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఆమె అందాలకు ఎవరూ వంకలు పెట్టలేకపోతున్నారు. రోజు రోజుకీ సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ పెరిగిపోతోంది. నాజూకు అందాలతో కుర్రకారును ఎప్పటికప్పుడు కవ్విస్తూనే ఉంది.
అనసూయ నిరంతరం సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోస్ ను షేర్ చేస్తూ.. నెటిజెన్స్ ను నిద్రపట్టనివ్వకుండా చేస్తోంది. లేటెస్ట్ గా అనసూయ తెల్లచీరలో దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఫోటోలకు పోజులిచ్చి.. తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. జబర్దస్త్ లో యాంకరింగ్ పూర్తయ్యాకా ఎప్పటిలాగానే.. ఆమె ధరించిన డ్రెస్ తో ఫోటో షూట్ చేయడం ఆమెకు అలవాటు. ఈ నేపథ్యంలోనే ఈ తెల్లచీర ఫోటోలకు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.
అనసూయ హాట్ యాంకరింగ్ జబర్దస్త్ కామెడీ షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నది అందరూ ఒప్పుకొనే వాస్తవం. కొత్తదనం ఉట్టిపడే డిజైన్స్ తో ధరించే రంగుల రంగుల డ్రెసెస్…అనసూయలోని అందాల్ని రెట్టింపు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేకించి ఎలాంటి చీరకట్టుకున్నా.. రంగమ్మత్త అందాలు మరింతగా ఎలివేట్ అవుతాయి. అందుకే ఈ తెల్లచీర ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోస్ కి మంచి మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి.