పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వెలువరించింది. తెలుగు భాషను అధికార హోదా కల్పించింది. తెలుగు భాషకు అధికార గుర్తింపు ఇవ్వాలని అక్కడి తెలుగువాళ్లు ఎన్నో ఏళ్లగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తెలుగును అధికార భాషగా గుర్తిస్తున్నట్లు కేబినెట్ తన నిర్ణయాన్ని వెలవరించింది. బెంగాల్‌లో ఇప్పటికే 10కి పైగా అధికార భాషలున్నాయి. బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ అత్యధికంగా తెలుగువాళ్ల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మమత సర్కార్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్ర ఓటర్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఓట్లు ప్రభావితం చేయడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందనేది మమత ఆలోచన. మరి మమత నిర్ణయం ఎన్నికల్లో ఎంతవరకు ఉపయోగపడనుందో చూడాలి.
Must Read ;- ప్రశాంత్ కిషోర్ VS బీజేపీ.. ఇక డైరెక్ట్ వార్











