సూపర్ స్టార్ మహేశ్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఒన్ నేనొక్కడినే’. సినిమా కాన్సెప్ట్, హీరో క్యారక్టరైజేషన్ అన్నీ సరికొత్తగా ఉన్నా.. ఎందుకో గానీ సినిమా ఆశించిన రీతిలో అలరించలేకపోయింది. అయితే ఈ సినిమాతోనే టాలీవుడ్ లోకి ప్రవేశించింది బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి కృతి సనన్. ఆవ్ తుఝే మోకోర్తా అంటూ గోవా బీచ్ లో వయ్యారంగా చిందేసి.. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
తొలి చిత్రం ప్లాప్ కావడంతో.. కృతిసనన్ కి టాలీవుడ్ లో అంతగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. నాగచైతన్య ‘దోచేయ్’ సినిమాలో నటించిన తర్వాత .. మరో తెలుగు సినిమాలో కనిపించలేదు కృతి. ఆ తర్వాత బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయింది. అలాంటి ఈ బ్యూటీ .. మళ్ళీ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోందని వార్తలొస్తున్నాయి.
ప్రస్తుతం కృతి శెట్టి .. ప్రభాస్ ‘ఆదిపురుష్’ లో సీతాదేవిగా నటించబోతున్న సంగతి తెలిసిందే. ఆ క్రేజ్ తోనే ఆమె మరోసారి టాలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకోనుందట. త్వరలో ప్రారంభం కాబోయే ఒక తెలుగు సినిమాలో కృతి ప్రధాన పాత్ర పోసించబోతోందట. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. మరి అమ్మడు.. ఈ సినిమా సక్సెస్ తో.. తెలుగులో స్థిరపడే ప్రయత్నం చేస్తుందేమో చూద్దాం.
Must Read- క్రికెట్ కోచ్ గా మహేశ్ బాబు .. ఇంతకీ ఏ సినిమా? దర్శకుడెవరు?;











