అందాల అనుష్క సూపర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆతర్వాత ‘విక్రమార్కుడు, లక్ష్యం, డాన్, చింతకాయల రవి’.. ఇలా కమర్షియల్ సినిమాల్లో నటించిన అనుష్కకు ‘అరుంధతి’ సినిమా ఆమె కెరీర్ ని మలుపు తిప్పిందని చెప్పచ్చు. ఈ సినిమాతో లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయాలంటే ఈతరంలో అనుష్కనే పేరు తెచ్చుకుంది.

ఆ తర్వాత ‘బాహుబలి, రుద్రమదేవి, భాగమతి’.. తదితర చిత్రాలతో అనుష్క ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్ధానం సంపాదించుకుంది. అయితే.. ఆమెకు మరింత క్రేజ్ రావడం.. డిమాండ్ బాగా పెరగడంతో వరుసగా భారీ ఆఫర్స్ వచ్చాయి. ఎన్నిఆఫర్స్ వచ్చినా.. ఏదో ఒక సినిమా చేయాలి కాబట్టి సినిమాకి ఓకే చెప్పేద్దాం అని కాకుండా.. కథ నచ్చితేనే ఓకే చెప్పేది. రీసెంట్ గా నటనకు అవకాశం ఉన్న నిశ్శబ్ధం సినిమా చేసింది.
ఈ సినిమా కరోనా కారణంగా థియేటర్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది కానీ.. ఆశించిన స్ధాయిలో మెప్పించలేకపోయింది. ఇప్పటి వరకు తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. దీంతో అనుష్క తదుపరి చిత్రం ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ‘రా రా కృష్ణయ్య’ దర్శకుడు మహేష్ లాక్ డౌన్ టైమ్ లో అనుష్కకు కథ చెప్పడం జరిగిందని తెలిసింది. ఈ కథ ఆమెకు నచ్చిందని టాక్ వినిపిస్తోంది. మరి.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.
Must Read ;- నెగెటివ్ షేడ్స్ తో మెప్పించిన దేవసేన వదినమ్మ
https://www.youtube.com/watch?v=16FEO0XdHaM











