కూచిపూడి, భరతనాట్యంలో అద్భుతమైన ప్రతిభను కనబరిచే కళాకారిణి ఆశ్రిత వేముగంటి. డాన్సర్స్ కు అభినయం, హావభావాలు సహజంగానే అబ్బుతాయి కాబట్టి.. ఆమె సినిమాల్లో నటించడం పెద్ద విషయం కాలేదు. దానికి తోడు ఆమె ముగ్ధమనోహరంగా ఉండడం కూడా దానికి బాగా కలిసొచ్చింది. ఇటు నాట్యం, అటు అందం రెండూ ఆభరణాలైన ఆమెను దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి 2’ లో అనుష్క వదిన గా మొదటి ఛాన్స్ ఇచ్చారు. అంతకుముందే ఆమెకి షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన అనుభవం ఉండడంతో ఆ సినిమాలోని ఆపాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఆ తర్వాత యాత్రలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర ధారి మమ్ముట్టి భార్య గా విజయమ్మ పాత్రలోనూ మెప్పించింది.
ఇప్పుడు రీసెంట్ గా విడుదలైన ‘క్రాక్’ లో సముద్రఖని భార్యగా నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో అదరగొట్టింది ఆశ్రిత. ఆ పాత్రకు మంచి అప్లాజ్ వస్తోంది. కూతురు తను ప్రేమించిన కానిస్టేబుల్ ను పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేని ఆమె .. కూతురు మీద ప్రేమను చంపుకోలేక.. కానిస్టేబుల్ ను చంపమని భర్త పాత్రైన సముద్రఖనిని రెచ్చగొట్టే తీరు, ఆ పాత్రలోని మరో కోణాన్ని ఎలివేట్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే.. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర కన్నా కాస్తంత కన్నింగ్ గానూ, క్రూయల్ గానూ ఆ పాత్రను మలిచారని చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఆశ్రిత వేముగంటికి వరుసగా విలన్ పాత్రలు వచ్చినా ఆశ్చర్యం లేదు.
Must Read ;- సమంత విలన్ గా మరో రకం హాట్ గురూ