bollywood actor ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయై.. తొలి ప్రయత్నంతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఆతర్వాత అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, చరణ్ తో ధృవ, మహేష్ బాబుతో ‘స్పైడర్’ చిత్రాల్లో నటించింది. అయితే.. టాలీవుడ్ లో కొత్త కథానాయికలు రావడంతో రకుల్ కెరరీ్ లో కాస్త వెనకబడింది.

ఈ అందాల భామ తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లో కూడా నటిస్తుంది. తెలుగులో మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చేసింది. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇప్పుడు రకుల్ బాలీవుడ్ మూవీలో నటిస్తుంది. గతంలో రకుల్ అజయ్ దేవగన్ తో కలిసి ‘దే దే ప్యాయర్ దే’ మూవీలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.
ఇప్పుడు అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘థాంక్ గాడ్’ అనే బాలీవుడ్ మూవీలో నటిస్తుంది. ఈ చిత్రానికి ఇంద్ర కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్ టైనర్ జనవరి 21 నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు ఇంద్రకుమార్ స్పందిస్తూ.. ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం, ఫైనల్ గా జనవరి 21 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయనున్నాం. అజయ్ దేవగన్ తో మరోసారి వర్క్ చేసేందుకు చాలా ఎగ్జైట్ గా వెయిట్ చేస్తున్నాను అని చెప్పారు. మరి.. ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే.. రకుల్ కి బాలీవుడ్ మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.
Must Read ;- రకుల్ చేతిలో అన్ని సినిమాలు ఉన్నాయా.?











