ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ.. ఇలా తెలుగులో హీరోయిన్ రష్మిక నటించిన సినిమాలన్నీ సక్సస్ అవ్వడంతో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్య్దింది. ఈ అమ్మడు నటిస్తే.. బొమ్మ బ్లాక్ బస్టరే అనే పేరు తెచ్చుకుంది. రష్మిక ప్రస్తుతం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటిస్తోంది. అయితే.. ఈ భామను బాలీవుడ్ లోకి వెళ్లాలని ఉందా అని పలు ఇంటర్ వ్యూలో అడిగితే.. తనకు అలాంటి ఆలోచన లేదని చెప్పింది. ఇప్పుడు సడన్ గా బాలీవుడ్ మూవీని ఎనౌన్స్ చేసి సర్ ఫ్రైజ్ చేసింది.
రష్మిక.. సిద్థార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను అనే బాలీవుడ్ మూవీలో నటించనున్నట్టు ప్రకటించింది. బాలీవుడ్ మూవీ చేయాలనే ఆలోచన లేదని చెప్పిన రష్మిక ఇంత సడన్ గా ఎందుకు ఈ సినిమాకి ఓకే చెప్పింది అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే… ఈ సినిమా కథ ప్రకారం ఇందులో సౌతిండియాకు చెందిన భామ కావాలట కొంత మంది తారల పేర్లలో షార్ట్ లిస్ట్ చేసి.. రష్మిక అయితే బాగుంటుందని ఈ సినిమా డైరెక్టర్ కి చెప్పారట యూనిట్ సభ్యులు. అప్పుడు రష్మిక నటించిన గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు సినిమాలు చూసారట ఈ సినిమా డైరెక్టర్.
అంతే.. మిషన్ మజ్ను మూవీకి రష్మిక అయితేనే కరెక్ట్ అని ఆ డైరెక్టర్ ఫిక్స్ అయ్యారట. రష్మికని కాంటాక్ట్ చేస్తే వెంటనే ఓకే చెప్పిందట. కారణం ఏంటంటే.. కన్నడ సినిమాల్లో నటించింది. తెలుగులో టాప్ హీరోయిన్. రీసెంట్ గా తమిళ సినిమాలో నటించింది. వచ్చే సంవత్సరం ఈ సినిమా రిలీజ కానుంది. ఇక బాలీవుడ్ మూవీ చేస్తే పాన్ ఇండియా మార్కెట్ పెరుగుతుంది. యాడ్స్ బాగా వస్తాయి. రెమ్యూనరేషన్ పెరుగుతుంది. అందుకనే బాలీవుడ్ మూవీ ఆఫర్ రాగానే వెంటనే ఓకే చెప్పేసిందట. అది.. రష్మిక బాలీవుడ్ ఎంట్రీ వెనకున్న అసలు కారణం అని టాక్ వినిపిస్తుంది.
Must Read ;- పుట్టు చికెన్ కూర ఇట్టే చేసేసిన రష్మిక మందన్న











