రకుల్ ప్రీత్ సింగ్.. కెరటం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించింది. రఫ్, లౌక్యం, పండగ చేస్కో, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయకా తదితర చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సక్సస్ సాధించి స్టార్ హీరోయిన్ అయ్యింది. టాలీవుడ్ కింగ్ నాగార్జునతో మన్మధుడు 2 సినిమాలో నటించింది. ఆ సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేదు. ఆతర్వాత నుంచి కెరీర్ లో కాస్త వెనకబడింది.

తాజాగా మెగాస్టార్ మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తో కలిసి ఓ సినిమాలో నటించింది. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా తప్పితే రకుల్ కి తెలుగులో అంతగా అవకాశాలు లేవు. కెరీర్ లో బాగా వెనకబడింది అనుకుంటే.. వరుసగా సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు అని తెలిసింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తుంది. ఇంతకీ రకుల్ ఏయే సినిమాల్లో నటిస్తుందంటే.. నితిన్ సరసన చెక్ మూవీలో నటిస్తుంది.
అలాగే హిందీలో అర్జున్ కపూర్ సరసన సర్ధార్ అండ్ గ్రాండ్ సన్, జాన్ అబ్రహంతో ఎటాక్, అజయ్ దేవగన్ మేడే సినిమాల్లో నటిస్తుంది. అంతే కాకుండా తమిళ్ లో రెండు సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్పిందని తెలిసింది. యూనివర్శల్ హీరో కమల్ హాసన్ తో ఇండియన్ 2, శివకార్తికేయన్ తో అయలన్ సినిమాల్లో నటిస్తుంది. మొత్తం ఏడు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. కరోనా ముందు కెరీర్ లో వెనకబడినా.. కరోనా తర్వాత స్పీడు పెంచి దూసుకెళుతుండడం విశేషం.
Must Read ;- రకుల్ మూడు పడవల ప్రయాణం!











