ప్రస్తుతం తెలుగులో వైష్ణవ్ తేజ్ సరసన ఓ చిత్రంలోను, నితిన్ సరసన “చెక్” లోను, నటిస్తున్న రకుల్ కు మూడు బాలీవుడ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. వాటిలో అజయ్ దేవగన్, అమితాబ్ నటిస్తున్న `మేడే” చిత్రంలోను, జాన్ అబ్రహాం నటిస్తున్న “ఎటాక్” లోను, అలాగే తమిళంతో పాటు పలు ఇతర భాషలలో రూపొందుతున్న “ఇండియన్ 2” తదితర సినిమాల్లో రకుల్ సందడి చేయబోతోంది. ఇదిలావుండగా ఇటీవల రకుల్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దాంతో చేస్తున్న సినిమా షూటింగులకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఆమె ఉన్నట్లుండి హైదరాబాద్ నగరంలో ప్రత్యక్షమైంది,

తాజాగా తనకు నెగటివ్ రిపోర్ట్ వచ్చిన విషయాన్ని సోషల్ మీడియాలో ట్వీట్ చేయడంతో పాటు ఎంచక్కా హైదరాబాద్ లో జరుగుతున్న“మేడే” చిత్రం షూటింగులో ఆమె తిరిగి పాల్గొంటోంది.ఇటీవల తనకు కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు అభిమానులు ఇచ్చిన సపోర్ట్ మరువలేనిదని వారికి కృతఙ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని అందులో చెప్పుకొచ్చింది. కరోనా రాకుండా ప్రజలు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా రకుల్ సూచించింది.











