పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఓకే చెప్పినప్పటి నుంచి వరుసగా సినిమాలు ఎనౌన్స్ చేస్తూ.. ఫ్యాన్స్ ని సర్ ఫ్రైజ్ చేస్తున్న విషయం తెలిసిందే. వకీల్ సాబ్ తర్వాత క్రిష్ తో ఓ మూవీ చేస్తున్నారు. ఇటీవల అయ్యప్పనున్ కోషియమ్ రీమేక్ స్టార్ట్ చేసారు. ఈ సినిమాలతో పాటు హరీష్ శంకర్, సురేందర్ రెడ్డితో కూడా సినిమాలు చేసేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే.. హరీష్ శంకర్ తో సినిమాని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి గబ్బర్ సింగ్ కి సీక్వెల్ అని ప్రచారం మొదలైంది.
అంతే కాకుండా.. పవన్ పోలీస్ అని చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. మరో విషయం ఏంటంటే.. పవన్ రెండు విభిన్న పాత్రల్లో నటించనున్నాడని టాక్ వచ్చింది. ఇలా ఈ క్రేజీ మూవీ గురించి వార్తలు వస్తుండడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అసలు ఇది నిజమేనా..? కాదా అని. ఇంతకీ విషయం ఏంటంటే.. గబ్బర్ సింగ్ సినిమాకి సీక్వెల్ కాదని.. అలాగే ఇందులో పవన్ రెండు పాత్రలు పోషించడం లేదని తెలిసింది.
అయితే.. ఇప్పటి వరకు పవన్ చేయని పాత్రను చేస్తున్నారని.. అభిమానులకు పండగే అనేలా ఈ సినిమా ఉంటుందని సమాచారం. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. దేవి రెడీ చేసిన ట్యూను పవన్, హరీష్ కి బాగా నచ్చిందని తెలిసింది. 2021లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం.
Must Read ;- చిరు, పవన్ సినిమాల్లో.. లక్కీ ఛాన్స్ దక్కించుకున్న బిగ్ బాస్ ఫేమ్ దివి