నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రానికి రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో విజయ్ దేవరకొండతో తొలి ప్రయత్నంగా టాక్సీవాలా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా సక్సస్ సాధించడంతో డైరెక్టర్ రాహుల్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. నానితో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు.
ఇక శ్యామ్ సింగరాయ్ సినిమా విషయానికి వస్తే.. థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ తో రూపొందుతోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో కలకత్తా కాళీ టెంపుల్ సెట్ వేస్తున్నారు. ఈ సెట్ కోసం రూ. 6 కోట్లు ఖర్చు పెడుతున్నారని తెలిసింది. శంషాబాద్ కి సమీపంలో 15 ఎకరాలు లీజుకు తీసుకుని సెట్ వేస్తున్నారు. ప్రస్తుతం ఆర్ట్ డిపార్టమెంట్ ఆ పనిలో ఉందని.. వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుందని తెలిసింది. ఇందులో నాని సరసన ఫిదా బ్యూటీ సాయిపల్లవి, మడోనా సెబాస్టియన్, కృతిశెట్టి నటిస్తున్నారు.
ఈ సినిమాని ముందుగా సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించాలి అనుకున్నారు. ఈ సంస్థ నుంచి ఎనౌన్సమెంట్ రావడం కూడా జరిగింది. అయితే.. బడ్జెట్ విషయంలో ఆలోచనలో పడ్డారట. నాని మాత్రం కథ బాగుంది. బడ్జెట్ విషయంలో వెనకడుగు వేయద్దు. కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ నిర్మించాలి అన్నాడని.. దీంతో డిఫరెన్స్ రావడంతోనే సితార సంస్థ తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఆతర్వాత నిర్మాత వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.
Must Read ;- ఫస్ట్ లుక్ : క్లాస్ గా మాస్ అప్పీల్ ఇచ్చిన ‘టక్ జగదీష్’